ఆన్‌లైన్‌లో టీటీడీ టికెట్లు

TTD releases online quota of darshan tickets for March 2019

తిరుమల : వచ్చే ఏడాది మార్చిలో తిరుమల శ్రీవారి  దర్శనం కోసం భక్తుల సౌకర్యార్థం ముందస్తుగా ఆన్‌లైన్‌లో 300 రూపాయుల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ అందుబాటులో ఉంచింది. 2019 మార్చికి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ నెల 11న విడుదల చేయునున్నట్టు టీటీడీ పేర్కొంది. ఐటీ అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టినట్టు వెల్లడించింది. ఆన్‌లైన్, ఈ-దర్శన్ కౌంటర్లు, పోస్టాఫీసుల్లో భక్తులు టికెట్లను బుక్ చేసుకోవచ్చని సూచించింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. 

సంబంధిత వార్తలు