విజయ్ కోసం ఇద్దరు హీరోయిన్లు!

Updated By ManamSat, 08/11/2018 - 19:50
Vijay Deverakonda, Rashmika Mandanna, Geetha Govindham, Nitya Menon, Anu emmanuel  

Vijay Deverakonda, Rashmika Mandanna, Geetha Govindham, Nitya Menon, Anu emmanuel  విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ రూపొందించిన చిత్రం ‘గీత గోవిందం’. ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అర్జున్‌రెడ్డి’ తర్వాత విజయ్ హీరోగా నటించిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మండన్న హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమలో రష్మిక కాకుండా మరో ఇద్దరు హీరోయిన్లు కూడా కనిపిస్తారని తెలుస్తోంది. కథ ప్రకారం ఈ ఇద్దరు హీరోయిన్లు సినిమాలో లేనప్పటికీ అతిథి పాత్రల్లో కనిపిస్తారట.

ఆ ఇద్దరు హీరోయిన్లు నిత్యా మీనన్, అనూ ఇమ్మానుయేల్. ఈ చిత్ర కథ కీలక మలుపు సమయంలో నిత్యా మీనన్ కాసేపు కనిపిస్తుంది. అలాగే అను మరో సందర్భంగా కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేస్తుందట. ఇద్దరు పాపులర్ హీరోయిన్లు ఈ సినిమాలో కాసేపు నటించడం విశేషంగానే చెప్పుకోవాలి. 

English Title
Two actress competition for Geetha Govindam movie
Related News