కర్నూలులో బాంబు పేలుడు, ముగ్గురు మృతి

Updated By ManamTue, 07/31/2018 - 12:55
Kurnool-nandyala checkpost blast
kurnool blast

కర్నూలు : నంద్యాల చెక్ పోస్ట్ సమీపంలోని డంపింగ్ యార్డ్ వద్ద మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మృతులు స్థిరాస్తి వ్యాపారం చేసే.. జంపాల రాజశేఖర్‌, జంపాల మల్లికార్జున, జంపాల శ్రీనివాసులుగా గుర్తించారు. గాయపడిన సుధాకర్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

కాగా పొలంలో... ఫ్లాట్ల సర్వే కోసం రాయిని తొలగిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. డీఎస్పీ యుగంధర్ బాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్ట్ మార్టంకు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

English Title
Three dies in Kurnool dump yard explosion!
Related News