గొయ్యిలో పడ్డ ఆర్టీసీ బస్సు: ఇద్దరు మృతి

Updated By ManamSun, 03/25/2018 - 11:38
Tamilnadu RTC bus, Bus driver, Crane fulls bus

Tamilnadu RTC bus, Bus driver, Crane fulls bus చిత్తూరు: తమిళనాడు ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. రేణిగుంట-చంద్రగిరి మార్గంలో అదుపుతప్పి గొయ్యిలో పడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని పేరూరు మండలం పాతకాల్వ వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. బస్సు ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ సహా ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడులోని సేలం నుంచి తిరుపతి వస్తుండగా బస్సుకు ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. గొయ్యిలో పడిన ఆర్టీసీ బస్సును క్రేన్‌ సహాయంతో పోలీసులు బయటకు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

English Title
Two killed, Tamilnadu RTC bus fall down at Big hole
Related News