కాచిగూడ రైల్వే స్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదం

Updated By ManamWed, 03/14/2018 - 18:01
Two MMTS Trains On One Track

Kacheguda Railway Station

హైదరాబాద్: నగరంలోని కాచిగూడ రైల్వే స్టేషన్‌‌లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఒకే ట్రాక్‌పై ఎదరెదురుగా రెండు ఎంఎంటీఎస్ రైళ్లు వచ్చేశాయి. దీంతో రైల్లో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు ట్రైన్ నుంచి దిగే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే డ్రైవర్ల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది రైల్లో ఉన్న ప్రయాణికులను దింపి.. రైళ్లను మళ్లించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

English Title
Two MMTS Trains On One Track In Kachiguda Railway Station
Related News