ఇద్దరు చంద్రులు.. ఒక మోదీ

Updated By ManamSun, 03/11/2018 - 02:19
chandrababu baidu chandrasekar rao modi

modhi chandrababu chandrasekarగత రెండు వారాలుగా రాజకీయ వేడి మండే సూర్యుడితో పోటీపడుతోంది. పేరులో చంద్రుడిని పెట్టుకున్న ఇద్దరు ముఖ్య మంత్రులు హాట్‌హాట్ కామెంట్లు చేస్తూ కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారుపై తొడగొడుతున్నారు. దీంతో అసలేం జరుగుతోందో అర్థం కాని పరిస్థితిలో తెలుగు ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. చూడబోతే కేసీఆర్ సరైన ముహూర్తం పెట్టుకోకుండా థర్డ్ ఫ్రంట్ ప్రకటన చేసినట్లుంది. ఇప్పుడు ఉన్నట్టుండి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కొత్తపాట పాడారు. బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ తమలాంటి ప్రాంతీయ పార్టీలతో కలవాలని ఆమె పిలుపునిచ్చారు. అంటే బీజేపీ-కాంగ్రెసేతర పక్షంలో తాను ఉండబోనని పరోక్షంగా చెప్పేసినట్లే. ఇక ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తొలుత ఒకసారి మద్దతు పలికినట్లు చెప్పినా, ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్‌తోనే పొత్తు ఉండొచ్చని సెలవిచ్చారు. ఇటీవలి కాలంలోనే ఎన్డీయే నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన శివసేన లాంటి పార్టీలు ఈయనకు ఎంతవరకు మద్దతిస్తాయో చూడాలి.

తెలుగు రాష్ట్రాలు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం.. గత రెండు వారాలుగా రాజకీయ వేడి మండే సూర్యుడితో పోటీపడు తోంది. పేరులో చంద్రుడిని పెట్టుకున్న ఇద్దరు ముఖ్య మంత్రులు హాట్‌హాట్ కామెంట్లు చేస్తూ కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారుపై తొడగొడుతున్నారు. దీంతో అసలేం జరుగుతోందో అర్థం కాని పరిస్థితిలో తెలుగు ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. 
ఉరుములేని పిడుగులా ఒక్కసారిగా ఉన్నట్టుండి థర్డ్ ఫ్రంట్ పెడతానంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. వయసు సహకరించక పోయినా తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని, సమాఖ్య వ్యవస్థకు సరికొత్త అర్థం చెబుతానని అన్నారు. దేశానికి ఒక కొత్త ఎజెండాతో దిశానిర్దేశం చేస్తానని; రిజర్వేషన్లు, నదీ జలాల పంపిణీ, ఉపాధి హామీ నిధుల లాంటి విషయాలలో కేంద్ర ప్రభుత్వ పెత్తనం అనవసరమని; అవన్నీ రాష్ట్రానికి సంబంధించిన విషయాలని చెప్పారు. దాదాపు నాలుగేళ్ల పాటు నరేంద్రమోదీ సహా కేంద్ర మంత్రివర్గంలో అందరితో సత్సంబంధాలు కొనసాగించి, తన తనయుడు రామారావును కూడా కేంద్రమంత్రుల వద్దకు పంపుతూ వాళ్ల దగ్గర ‘రామ్’ మంచి మార్కులు కొట్టేలా తగినంత గ్రూమ్ చేసిన కేసీఆర్ ఉన్నట్టుండి కేవలం ఒక్క రిజర్వేషన్ల కోసమే ఇదంతా చేస్తున్నారా అంటే ఎవరూ నమ్మలేని పరిస్థితి. రాష్ట్రపతి ఎన్నికలు, ఉప రాష్ట్రపతి ఎన్నికల లాంటి సందర్భాలతో పాటు, పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని కూడా స్వాగతించిన వారిలో అందరికంటే ముందున్న వ్యక్తి కేసీఆర్. అలాంటిది ఇప్పుడు ఉన్నట్టుండి ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లా లని ఎందుకు అనుకుంటున్నారో, తనతో పాటు ఇంకా మరి కొంతమంది పార్టీ సీనియర్ నాయకులను కూడా ఎంపీలుగా పోటీచేయించి కేంద్రంలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారో ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. కేసీఆర్‌కు ఈ ఆలోచన రావడం, బయటకు ప్రకటించడం అవ్వగానే మొట్టమొదట స్పందించిన వ్యక్తి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఇందులో లోగుట్టు ఒకటి ఉందని వినిపిస్తోంది. ప్రస్తుతం కేసీఆర్ వద్ద ఉన్నవారిలో అత్యంత సీనియర్, చాపకింద నీరులా ఉంటూనే తెరవెనక పనులన్నింటినీ చక్కబెట్టే సామర్థ్యం ఉన్న వ్యక్తి కేశవరావు. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పశ్చిమబెంగాల్ వ్యవహారాల ఇన్‌చార్జిగా వ్యవహరించారు. దాంతో ఆయనకు స్వతహాగానే ఆ రాష్ట్రంలో ప్రముఖ నాయకురాలైన మమతా బెనర్జీతో సత్సంబంధాలు ఉండే అవకాశం ఉంటుంది. బహుశా ఆయనే ముందుగా కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ యోచనను దీదీ చెవిలో ఊది ఆమెతో పలికించి ఉండొచ్చని అంటున్నారు.

కానీ, చూడబోతే కేసీఆర్ సరైన ముహూర్తం పెట్టుకోకుండా థర్డ్ ఫ్రంట్ ప్రకటన చేసినట్లుంది. ఎందుకంటే, ‘‘తమ్ముడూ.. నువ్వు ఎలా చెబితే అలా’’ అన్న దీదీ, ఇప్పుడు ఉన్నట్టుండి కొత్తపాట పాడారు. బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ తమలాంటి ప్రాంతీయ పార్టీలతో కలవాలని ఆమె పిలుపునిచ్చారు. అంటే బీజేపీ-కాంగ్రెసేతర పక్షంలో తాను ఉండబోనని పరోక్షంగా చెప్పేసినట్లే. ఇక ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తొలుత ఒకసారి మద్దతు పలికినట్లు చెప్పినా, ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్‌తోనే పొత్తు ఉండొచ్చని సెలవిచ్చారు. కేసీఆర్ గతంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. ఆ సమయంలో ఆయనకు వివిధ ప్రాంతీయ పార్టీల నాయకులు, జాతీయ నాయకులందరితో మంచి పరిచయాలు ఉన్నాయి. వాళ్లందరినీ కూడగట్టుకుని బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో మూడోకూటమిని ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలోనే ఎన్డీయే నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన శివసేన లాంటి పార్టీలు ఈయనకు ఎంతవరకు మద్దతిస్తాయో చూడాలి. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి చెబు తున్న థర్డ్ ఫ్రంట్‌లో ఎదురుకాబోయే అతిపెద్ద సమస్య- బహునాయకత్వం. కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారు, ఒకవేళ నిజంగా అధికారంలోకి వచ్చేంత మెజారిటీ వస్తే వాళ్లలో ఎవరు ప్రధానమంత్రి పీఠం అధిష్ఠించాలనేది చాలా పెద్ద సమస్య అవుతుంది. 

ప్రధాని పదవిపై చాలామందికి ఆశలు
వివిధ రాష్ట్రాలలో చాలామంది సీనియర్ మోస్ట్ నాయకులున్నారు, వాళ్లలో చాలా మందికి ఎర్రకోట మీద జెండా ఎగరేయాలన్న ఆశ ఉంది. ‘‘...అను నేను దేశ ప్రధాన మంత్రిగా’’ అని ప్రమాణస్వీకారం ఎప్పుడు చేస్తామా అన్న కోరిక మదిలో మెదులుతూనే ఉంటుంది. ఇంతమంది నాయకుల మధ్య నెగ్గుకురావడం, తన నాయకత్వానికి వాళ్ల ఆమోదం పొందడం చిన్న విషయం కాదు. అందులో తెలంగాణ చంద్రుడు ఎంతవరకు విజయం సాధిస్తారన్నది చూడాలి. ఇక ఆయన తనతోపాటు తన మేనల్లుడు హరీశ్‌రావు, ఆర్థికమంత్రిగా బాధ్యతలు మోస్తూనే చాలాలో ప్రొఫైల్‌లో ఉండే తన కుడిభుజం లాంటి ఈటల రాజేందర్, సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు.. ఇలాంటి కొందరు గట్టి నాయకులను కూడా జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లాలను కుంటున్నారని వినిపిస్తోంది. ఇప్పటికే ఆయన కుమార్తె కవిత నిజామాబాద్ ఎంపీగా పార్లమెంటులో మంచిపేరు సాధించారు. ఇక ఇప్పుడు తన సైన్యంలోని ప్రధాన బలగా న్నంతటినీ అక్కడకు తీసుకెళ్తానంటున్న కేసీఆర్.. ఏదో పెద్ద ప్లానే వేస్తున్నట్లు కనపడుతోంది. ఇప్పటికే పలురంగాల ప్రముఖులు, రిటైర్డ్ అధికారులు, ఇపుడున్న అధికారులతో కూడా ఆయన మంతనాలు మొదలుపెట్టారు. 

మళ్లీ రెండుకళ్ల సిద్ధాంతం
ఇక తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు, ప్రధాని నరేంద్రమోదీ కంటే... ఇంకా ఆ మాటకొస్తే దేశ రాజ కీయాల్లోనే అత్యంత సీనియర్ నాయకుడిగా చెప్పుకొంటున్న చంద్రబాబు నాయుడిది మరో కథ. నాలుగేళ్ల పాటు బీజేపీతో భుజాలు కలిపి పయనించి, వాళ్లు హోదా ఇవ్వం మొర్రో అని మొదటి నుంచి చెబుతున్నా ఏదో దింపుడు కల్లం ఆశతో ఇన్నాళ్లూ ఉండి ఇప్పుడు తాజాగా సగం విడా కులు తీసుకున్నారాయన. సగం విడాకులు అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, కేంద్ర మంత్రివర్గంలో ఉన్న తన ఇద్దరు మంత్రులతో రాజీనామాలు అయితే చేయించారు గానీ, ఇంకా ఎన్డీయే నుంచి పూర్తిస్థాయిలో వైదొలగలేదు. స్వయంగా తాను కూడా ఎన్డీయే కన్వీనర్‌గానే ఉంటున్నారు. ఇలా రెండు పడవల మీద కాళ్లేయడం ఎందుకో అర్థం కావ ట్లేదు. ప్రత్యేక హోదా, రాష్ట్రాభివృద్ధి ఈ రెండూ తనకు ‘రెండు కళ్లు’ అని చంద్రబాబు చెప్పగానే చాలామందికి రాష్ట్ర విభజన సమయం నాటి డైలాగు మరోసారి గుర్తుకొచ్చింది. అప్పట్లో కూడా ఆయన తనకు తెలంగాణ, ఆంధ్ర రెండు కళ్లని, వాటిలో ఏది వదులుకుంటావని అడిగితే ఏం చెప్పాలని అన్నారు. విభజనను సమర్ధిస్తారా, వ్యతిరేకిస్తారా అన్న ప్రశ్నకు ఆయనతో సమాధానం చెప్పించాలని జాతీయ మీడియాకు చెందిన సీనియర్ జర్నలిస్టులు తలకిందులుగా తపస్సు చేసినా సాధ్యం కాలేదు. తనకు రెండు ప్రాంతాలూ ముఖ్యమేనని ఆయన అప్పట్లో చెప్పారు.

 ఇప్పుడు మరోసారి ఆయన రెండుకళ్ల సిద్ధాంతం తెరమీదకు వచ్చింది. 29 సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చి దాదాపు నాలుగేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వంలో తన పార్టీని భాగస్వామిగా ఉంచిన తర్వాత  మరో ఏడాది లోపే ఎన్నికలు ముంచుకొస్తున్నాయనగా ఇప్పుడే బీజేపీ సర్కారు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదన్న విషయం ఆయ నకు అర్థమైంది. కేంద్రాన్ని గట్టిగా అడగాలని, రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ప్రతిపక్షాలే కాదు, సొంత పార్టీలోని సీనియర్ నాయకులు ఎన్నిసార్లు ఎంత గట్టిగా చెప్పినా పట్టించుకోని చంద్రబాబు, ఉన్నట్టుండి జైట్లీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అదే రోజు రాత్రి 10.45 గంటల వరకు ఎంపీలు, మంత్రులు, ముఖ్యనేతలందరితో పలు దఫాలుగా చర్చించి అప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఆయన మాటకు విలువనిచ్చి తమ పదవులను వదులుకున్న కేంద్ర మంత్రులిద్దరిలో చూడగానే పెద్దమనిషి, చాలా గౌరవం ఇవ్వాలనిపించే వ్యక్తి అశోక్ గజపతిరాజు. పౌర విమాన యాన శాఖ మంత్రిగా ఉండి కూడా సాధారణ ప్రయాణికు ల్లాగే క్యూలైన్లో వచ్చి, చెకిన్ చేసి ఎకానమీ క్లాసులో ప్రయాణించే వ్యక్తి ఆయన. సాధారణంగా అవతలి వ్యక్తిని ‘దద్దమ్మ’ అనాలంటే కూడా అదేదో బాగా పెద్దతిట్టుగా భావించే వ్యక్తి. అలాంటి రాజుగారు కూడా పార్లమెంటులో సహచర ఎంపీలతో కలిసి ప్రత్యేక హోదా కోసం నిలబడి నినదించారు. 


ఉన్నట్టుండి జైట్లీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అదే రోజు రాత్రి 10.45 గంటల వరకు ఎంపీలు, మంత్రులు, ముఖ్యనేతలందరితో పలు దఫాలుగా చర్చించి అప్పుడు చంద్రబాబు తన నిర్ణయాన్ని ప్రకటించారు. కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏంచేస్తారన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. ఆయన కూడా తోటి తెలుగు ముఖ్యమంత్రిలాగే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారా... థర్డ్ ఫ్రంట్‌కు మద్దతితస్తారా అన్న విషయంలో ఇంతవరకు ఎక్కడా బయటపడ లేదు. 2050 నాటికి రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెడతానని ఆయన అంటున్నారు. కాబట్టి అప్పటివరకు రాష్ట్ర రాజకీయాల్లో ఉండి దిశానిర్దేశం చేయాల్సిందే. అందువల్ల లెక్క ప్రకారం చూసుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల దిశగా ఆలోచన చేసేలా లేరు. 

తరువాత అడుగు ఎటు?
కేంద్రమంత్రివర్గం నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏంచేస్తారన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. ఆయన కూడా తోటి తెలుగు ముఖ్యమంత్రిలాగే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారా... థర్డ్ ఫ్రంట్‌కు మద్దతిస్తారా అన్న విషయంలో ఇంతవరకు ఎక్కడా బయటపడ లేదు. ఒకవేళ ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే అందరి కంటే సీనియర్‌ను తానే అని ఎటూ అనుకుంటున్నారు కాబట్టి ప్రధానమంత్రి కంటే తక్కువ పదవి ఏదైనా ఆయన తీసుకోరు గాక తీసుకోరు. కానీ, ఒకవైపు అమరావతి లాంటి అద్భుతమైన రాజధాని నిర్మాణం, పెండింగులోనే ఉన్న బోలెడన్ని ప్రాజెక్టులు, సాగునీటి సంకల్పం, విజయవాడ, విశాఖపట్నం మెట్రోరైళ్లు.. ఇలా ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి అసలు రాష్ట్రాన్ని వదిలిపెట్టి జాతీయ రాజకీయాల్లోకి చంద్రబాబు వెళ్తారా అన్నది అనుమానమే. 2050 నాటికి రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిల బెడతానని ఆయన అంటున్నారు. కాబట్టి అప్పటివరకు రాష్ట్ర రాజకీయాల్లో ఉండి దిశానిర్దేశం చేయాల్సిందే. అందువల్ల లెక్క ప్రకారం చూసుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల దిశగా ఆలోచన చేసేలా లేరు. తన తనయుడు లోకేశ్‌ను కూడా అటు పంపే ఉద్దేశం ఆయనకు ఉన్నట్లు ఎక్కడా ఇప్పటివరకు వినిపించ లేదు. కొత్త పొత్తుల గురించి ఏమైనా ఆలోచిస్తారా.. లేదా సొంతంగానే ఎన్నికల బరిలోకి దిగుతారా అనేది మాత్రం చూడాల్సి ఉంది.

Tags
English Title
Two moons .. a Modi
Related News