మన్యంలో మందుపాతరల కలకలం

Updated By ManamMon, 11/06/2017 - 22:13
landmine
  • ఏజెన్సీలో రెండు మందుపాతరల గుర్తింపు

  • జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘటన

  • పోలీసులు అలర్ట్.. రంగంలోకి బాంబుస్క్వాడ్

  • 30 కిలోల బరువున్న మందుగుండు

  • రెండు ఇనుప బకెట్లలో గుర్తించిన బృందం

  • భారీ విధ్వంసానికి మావోయిస్టుల వ్యూహం

  • గుర్తించి.. నిర్వీర్యం చేసిన పోలీసులు

  • రెండేళ్ల తర్వాత మరోసారి మందుపాతరలు

landmineవెంకటాపురం (నూగూరు) నవంబరు 6 (మనం న్యూస్): తెలంగాణలో చాలా కాలంగా కనిపించని మావోయిస్టులు.. ఒక్కసారిగా మళ్లీ కలకలం రేపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండల ఏజెన్సీలో ఆర్‌అండ్‌బీ రహదారిపై మందుపాతరలు అమర్చారు. కొద్ది ఆలస్యైమెనా, విషయం తెలిసిన పోలీసులు వెంటనే అప్రమత్తమై.. బాంబుస్క్వాడ్‌ను రప్పించారు. మందుపాతరలు బయటకు తీసి, వాటిని నిర్వీర్యం చేశారు. వెంకటాపురం- చర్ల ప్రధాన ఆర్‌అండ్‌బి రహదారిపై ఆలుబాక, మొర్రవానిగూడెం గ్రామాల మధ్యలోని ఓ చెరువు సమీపంలో 30 కిలోల బరువైన మందుగుండు సామగ్రిని రెండు ఇనుప బక్కెట్లలో నింపి.. భారీ విధ్వంసం సృష్టించేందుకు మావోయిస్టులు వ్యూహం పన్నారు.  విషయం తెలిసిన పోలీసులు.. ఏటూరునాగారం ఏఎస్పీ రాహుల్ హెగ్డే పర్యవేక్షణలో సోవువారం ఉదయం ఈ బాంబులను నిర్వీర్యం చేసే పని మొదలుపెట్టారు. ముందుగా చర్ల - భద్రాచలం రహదారిలో వాహనాల రాకపోకలను రెండు గంటల పాటు నిలిపివేశారు. జేసీబీ సాయంతో గొయ్యి తవ్వి.. రెండు బకెట్ బంబులను బయుటకు తీసేశారు. 

రెండేళ్ల క్రితం కూడా...
మన్యంలో రహదారులపై మావోయిస్టులు ఇలా మందుపాతరలు అమరుస్తున్నారన్న విషయం తెలిసి పోలీసులు అప్రమత్తమవుతున్నారు. రెండేళ్ల క్రితం కూడా ఇలాగే మొర్రవాని గూడెం సమీపంలో రహదారికి ఇరువైపులా మావోయిస్టులు మందుపాతరలు అమర్చగా వాటిని పోలీసులు గుర్తించి నిర్వీర్యం చేశారు. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్ల తర్వాత మందుపాతరలు బయటపడటంతో జిల్లా పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. వెంకటాపురం పోలీసు సర్కిల్ పరిధిలోని వెంకటాపురం, వాజేడు, పేరూరు పోలీసు స్టేషన్ల పరిధిలోకి వచ్చే ప్రధాన రహదారులపై ఇప్పటికే అనేక ప్రాంతాల్లో మావోయిస్టులు మందు పాతరలు అమర్చారనే ప్రచారం ఉంది. దానికి ఊతమిస్తూ ఆలుబాక సమీపంలో ప్రధాన రహదారి పైనే బకెట్ బాంబులు బయటపడటంతో అంతా ఆందోళన చెందుతున్నారు. స్థానికులు నిత్యం ఇదే రహదారి గుండా ప్రయాణిస్తారు. దాంతో ఇటు వెళ్లాలంటేనే భయుపడుతున్నారు. వెంకటాపురం సీఐ రవీందర్ , ఎస్‌ఐ బండారి కుమార్‌ల నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బలగాలు మందు పాతరల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 

English Title
Two powerful landmines unearthed, defused in Telangana FacebookTwitterGoogle+LinkedInWhatsAppMore
Related News