రెండో వికెట్ ఢమాల్.. కోహ్లి రనౌట్!

Updated By ManamTue, 02/13/2018 - 18:29
5th ODI, India Team, Virat kohli run out, Rohit sharma

5th ODI, India Team, Virat kohli run out, Rohit sharmaపోర్ట్‌ ఎలిజబెత్‌: ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదో వన్డేలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. భారత ఓపెనర్ శిఖర్ ధావన్ (23 బంతుల్లో 8 ఫోర్లు) 34 పరుగులకే తొలి వికెట్ రూపంలో నిష్ర్కమించాడు. ధావన్ స్థానంలో బరిలోకి దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లి (54 బంతుల్లో 2 ఫోర్లు) 36 పరుగులకే డుమినీ బౌలింగ్‌లో రనౌట్‌గా వెనుదిరిగాడు. 

మళ్లీ ఫాంలోకి రోహిత్..
వరుస మ్యాచ్‌ల్లో విఫలమవుతూ వస్తున్న రోహిత్ శర్మ ఐదో వన్డేలో మళ్లీ ఫాంలోకి వచ్చినట్టు కనిపిస్తున్నాడు. ఆది నుంచి ఆచితూచి ఆడుతూ (84 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్) 80 పరుగులతో సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. రోహిత్ శర్మ (80) తోడుగా కోహ్లి స్థానంలో రహానె (2) ఇద్దరు నాటౌట్‌గా ఉన్నారు. ప్రస్తుతం భారత జట్టు 27 ఓవర్లలో 2 వికెట్ నష్టానికి 160 పరుగులతో కొనసాగుతోంది. సఫారీ జట్టులో రబడాకు ఒక వికెట్ దక్కింది. 

English Title
Two wickets lost by India Team, Virat kohli run out
Related News