సెన్సార్ పూర్తి చేసుకున్న ‘యూ టర్న్’

Updated By ManamSat, 09/08/2018 - 12:54
U Turn

U Turnసమంత ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ‘యూటర్న్’. తెలుగు, తమిళ్‌లో ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి తాజాగా సెన్సార్ పూర్తైంది. చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్‌లు లేకుండా యు/ఎ సర్టిఫికేట్‌ను ఇచ్చారు. దీంతో ప్రమోషన్లలో మరింత వేగాన్ని పెంచనుంది చిత్ర యూనిట్.

కాగా థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి పూర్ణచంద్ర తేజస్వి సంగీతం అందించగా.. పవన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ట్రైలర్, ప్రమోషనల్ సాంగ్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

English Title
U Turn censor completed
Related News