అండర్‌19 వరల్డ్ కప్: ఫైనల్లోకి భారత్

Updated By ManamTue, 01/30/2018 - 09:25
Team India

Team Indiaఐసీసీ నిర్వహిస్తున్న అండర్ 19 ప్రపంచ కప్‌లో టీమిండియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో భాగంగా పాకిస్థాన్‌తో తలపడ్డ భారత్ 203 పరుగుల తేడాతో ఆ దేశాన్ని చిత్తు చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 272 పరుగులు చేయగా.. పాకిస్థాన్ 69పరుగుల వద్దనే చితకలపడింది. దీంతో అండర్ 19 వరల్డ్ కప్‌లో ఆరోసారి ఫైనల్‌కు చేరింది భారత్. ఇక ఫైనల్లో ఫిబ్రవరి 3న ఆస్ట్రేలియాతో తలపడనుంది భారత్.

English Title
U19 World Cup: Team India beats Pakistan by 203 runs, enter into Final
Related News