మేమేం 700కోట్లు ప్రకటించలేదు: యూఏఈ

Updated By ManamFri, 08/24/2018 - 12:55
Kerala Floods

Kerala Floodsవరదలతో అల్లాడిన కేరళకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారీ సాయాన్ని ప్రకటించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దాదాపు 700కోట్లు యూఏఈ ప్రభుత్వం ప్రకటించగా, ఆ తరువాత ఆ సాయాన్ని కేంద్రం వద్దనడంతో పలు విమర్శలు కూడా వినిపించాయి. అయితే ఈ ఆర్థిక సాయంపై మరో సంచలనవార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. కేరళకు అందించే ఆర్థిక సాయం నిర్ధిష్ట మొత్తాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదని గల్ఫ్ దేశ రాయబారి ప్రకటించారు. కేరళకు అందించాల్సిన విరాళాలపై తమ అంచనా ఇంకా కొనసాగుతోందని అహ్మద్ అల్బన్నా చెప్పినట్లు ఓ పత్రిక ప్రకటించింది.

అయితే కేరళకు అబుదాబి యువరాజు షఏక్ మొహమ్మద్ బిన్ జావేద్ అల్ నహాన్ రూ.700కోట్ల ప్రకటించారని స్వయంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. కాగా దాదాపు రూ2వేల కోట్లకు పైగా నష్టపోయిన రాష్ట్రానికి కేంద్రం 600కోట్లు మాత్రమే ఇవ్వగా, గల్ఫ్ దేశం రూ.700కోట్ల భారీ సాయం ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వినిపించాయి. అయితే ఆ తరువాత ఆ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడంతో కేంద్రంపై విమర్శలు పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో యూఏఈ రాయబారి ఇంకా మేమేం ప్రకటించలేదని చెప్పడం సంచలనంగా మారింది.

English Title
UAE never officially announced aid for Kerala flood relief: Ambassador
Related News