ఆరోగ్యం సహకరించడం లేదు

Updated By ManamTue, 02/13/2018 - 10:56
Uma Bharti

Uma Bharti ఇకపై తాను ఏ ఎన్నికల్లో పోటి చేయబోనని కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి తెలిపారు. వయసు, అనారోగ్య కారణాల రీత్యా ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఆమె చెప్పారు. అయితే పార్టీ కోసం మాత్రం పనిచేస్తానని వెల్లడించారు.

ఝాన్సీలో మాట్లాడిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఒక ఎంపీగా పార్టీ కోసం తాను చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయన్నారు. అయితే ఉమాభారతి గతంలో ఖజురహో నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.

English Title
Uma Bharti will not contest in future elections
Related News