ఏకీకృత రూల్స్ చెల్లవు

Updated By ManamWed, 08/29/2018 - 00:34
High court judgement
  • ఉపాధ్యాయుల సర్వీసుపై హైకోర్టు తీర్పు   

imageహైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యా యులకు ఒకే విధమైన సర్వీస్ నిబంధనలు చెల్లవని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు-స్థానిక సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ నిబంధనలకు వీలుగా రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులు చెల్లవని మంగళవారం హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.  ఏకీకృత సర్వీసు నిబంధనలకు అనుకూలంగా, ప్రతికూలంగా దాఖలైన పలు వ్యాజ్యాలపై ఇరుపక్షాల వాదప్రతివాదనలు ముగిడంతో ఈ నెల 8న హైకోర్టు తీర్పును తర్వాత వెలువరిస్తామని ప్రకటించింది. మంగళవారం ప్రధాన న్యాయమూర్తి టీబీఎన్ రాధాకృష్ణన్, న్యాయమూర్తి వి.రామసుబ్రమణియన్లతో కూడిన డివిజన్ బెంచ్ రాష్ట్రపతి ఆదేశాలను కొట్టివేస్తూ 61 పేజీల తీర్పు వెలువరించింది.

1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరిస్తూ 2017 జూన్ 23న రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వుల్ని కొట్టేసింది. ఏకీకృత సర్వీస్ రూల్స్ నిమిత్తం 1975 ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఉత్తర్వుల్లో పేర్కొన్న పేరా రెండును తోసిపుచ్చింది. ఏకీకృత సర్వీస్ రూల్స్ 1998 నుంచి అమల్లో ఉండేలా రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని మూడో షెడ్యూల్లో చేర్చిన 23-ఎలో ఎంఈవో, జెడ్పీ హెడ్మాస్టర్లు చేర్చడం చెల్లదు. అధికరణ 371డీకి విరుద్ధం. వివిధ పోస్టులకు ఆ అధికరం ఉంది. కేడర్ల విలీనం, ఏకీకరణ చేయడానికి ఉద్దేశించి ఆ అధికరణం లేదు.  ఆ అధికర ణం లోకల్ కేడర్, లోకల్ ఏరియా, లోకల్ క్యాడేట్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇందులోబడే రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వొచ్చు. అయితే రాష్ట్రపతి ఏకంగా సర్వీస్ రూల్స్ ఏకీకరణ విషయంలో ఉత్తర్వులు ఇవ్వడం చెల్లదు. రాష్ట్రపతి ఆదేశాల్లోని పేరా 3లో పలు రకాల కేటగిరి పోస్టుల నిర్వహణ గురించి మాత్రమే ఉందిగానీ వివిధ కేటగిరీల విలీనం లేదా ఏకీకరణ ప్రస్తావన లేదు. ప్రాంతీయ అసమరతలు తొలగించేందుకే ఆ అధికరణంలోని పేరా 3 నిర్ధేశించి ఉంది. ఆ తరహా అసమానతలను నివారణకే ఆరు సూత్రాల విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీనిలో కూడా కేడర్ల విలీనం లేదా ఏకీకృత అంశాలు లేవు.  గత ఏడాది రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసే అవి 1998 నుంచి అమలు చేయాలనే తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నం కూడా చట్ట వ్యతిరేకమే అవుతుంది. కాబట్టే రాష్ట్రపతి ఉత్తర్వులు చెల్లవు... అని బెంచ్ తీర్పు చెప్పింది.

English Title
Unified Rules are not valid
Related News