అలా అనడం తప్పే: కేంద్రమంత్రి ఓరమ్

Updated By ManamSat, 07/14/2018 - 13:07
Union Minister Jual Oram
  • ‘మాల్యా’ప్రస్తావనపై కేంద్రమంత్రి వివరణ

Jual Oram హైదరాబాద్ : కేంద్ర గిరిజన శాఖ మంత్రి జోయల్ ఓరమ్ నోరు జారి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. బ్యాంకులకు  కోట్లాది రూపాయిలు కుచ్చుటోపీ పెట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాను కేంద్ర మంత్రి ప్రశంసలు కురిపించడం విమర్శలకు దారి తీసింది.  

దీంతో ఆయన నాలుక కరుచుకుని తాను అనుకోకుండా మాల్యా పేరు ప్రస్తావించానంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఆ సమయంలో వేరేవారి పేరు ప్రస్తావించబోయి పొరపాటున మాల్యా పేరు ఉదహరించినట్లు తెలిపారు. తాను మాల్యా పేరును ప్రస్తావించడం తప్పిదమే అంటూ కేంద్ర మంత్రి జోయల్ ఓరమ్ పేర్కొన్నారు.

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌లో  శుక్రవారం జాతీయ గిరిజన పారిశ్రామికవేత్తల సదస్సులో కేంద్ర మంత్రి జోయల్ ఓరమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘గిరిజన పారిశ్రామికవేత్తలకు కేంద్రం అన్నివిధాలు ప్రోత్సహిస్తుంది. గిరిజన సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు చేయుతతో గిరిజనులు చురుకుగా మారి పారిశ్రామికవేత్తలుగా మారాలి. చురుకుగా, తెలివిగా మారాలి. స్వశక్తితోనే ఏదైనా సాధ్యం అవుతుంది’అని అన్నారు.

పనిలో పనిగా విజయ మాల్యా చాలా చురుకైన వ్యక్తి అంటూ అని పొగిడారు. అంతేకాకుండా మాల్యాను అందరూ విమర్శిస్తారు కానీ మాల్యా అంటేనే బీ స్మార్ట్, ఆయన చాలమందికి ఉద్యోగాలు ఇచ్చారు. బ్యాంకులు, ప్రభుత్వానికి, రాజకీయ వేత్త్తలకు ఎంతోకొంత చేశారు... అంటూ మంత్రి వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ సమవేశానికి హాజరైనవారు మంత్రివర్యుల వ్యాఖ్యలతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. మంత్రి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేగడంతో ఆయన వివరణ ఇచ్చుకున్నారు.

English Title
Union Minister Jual Oram clarification on Vijay Mallya is smart
Related News