ఉర్జిత్ గుడ్‌బై?

Updated By ManamFri, 11/09/2018 - 06:18
urjit-patel
  • 19న రాజీనామా చేసే అవకాశం

  • ఆ రోజే ఆర్బీఐ బోర్డు సమావేశం

  • ప్రభుత్వం.. ఆర్బీఐ తీవ్ర వివాదాలు

  • ఆరోగ్యం పాడవుతోందన్న గవర్నర్

  • జాతీయ మీడియాలో ప్రచారం

urjit-patelన్యూఢిల్లీ: రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఈనెల 19న రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది. ఆరోజు బ్యాంకు బోర్డు సమావేశం ఉండటంతో, అందులోనే ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వానికి.. రిజర్వు బ్యాంకుకు మధ్య వివాదాలు బాగా ఎక్కువయ్యాయి. వీటితో తాను బాగా అలసిపోయానని, ఇది తన ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తోందని పటేల్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు జాతీయ ఆర్థికరంగ పత్రికలు చెబుతున్నాయి. ఎంఎస్‌ఎంఈలకు రుణాలివ్వడంలో నిబంధనలను సడలించాలని ప్రభుత్వం రిజర్వుబ్యాంకుతో పోరాడుతోంది. దాంతో పాటు రిజర్వు బ్యాంకు వద్ద ఉన్న మిగులు నిధులను తమకివ్వాలని కోరుతోంది. వాటిని ప్రజోపయోగ కార్యక్రమాలకు వెచచిస్తామని చెబుతోంది. దాంతో ఇరు వర్గాల మధ్య దాదాపు నెల రోజులుగా వివాదం ముదిరింది. దానికితోడు బ్యాంకు స్వతంత్రతకు భంగం వాటిల్లితే అది చాలా ప్రమాదకరం అవుతుందంటూ బ్యాంకు డిప్యూటీ గవర్నర్ విరళ్ ఆచార్య ఇటీవల చెప్పడంతో ఆర్బీఐ-సర్కారు మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. అంతేకాదు, రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా రిజర్వుబ్యాంకు స్వతంత్రత కారులో సీటుబెల్టు లాంటిదని, అది లేకపోతే ప్రమాదాలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం పటేల్ రాజీనామా వరకు వచ్చినా సరే.. తమ డిమాండ్లకు కట్టుబడి ఉంటామని చెబుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ డిమాండ్లను అంగీకరించడానికి రిజర్వు బ్యాంకు నిరాకరిస్తోందని, కనీసం నిర్మాణాత్మక చర్చలకు కూడా ముందుకు రావడం లేదని ఉన్న తాధికారులు అంటున్నారు. ఆర్థికలోటును తీర్చుకోడానికి మిగులు నిధులు ఇవ్వాలని ప్రభుత్వం కోరుతుంటే, రిజర్వు బ్యాంకు అందుకు నిరాకరిస్తోం ది. తమ హయాంలో కూడా ప్రభుత్వం నుంచి లెక్కలేనన్ని లేఖలు వచ్చేవని రఘురామ్ రాజన్ అన్నారు. నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల రంగంపై కూడా నియంత్రణలు తగ్గించాలని ప్రభు త్వం చెబుతోంది. అలాగే ఎంఎస్‌ఎంఈలకు రుణ వితరణ పెంచాలని, దానివల్ల ఆర్థికవృద్ధి సాధ్యమ వుతుందని ప్రభుత్వవర్గాలు వాదిస్తున్నాయి. మరి కొన్ని వారాల్లో ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు ఉంటంతో పాటు 2019లో సార్వత్రిక ఎన్నికలు కూడా ఉండటంతో ప్రభుత్వం దీనిపై గట్టిగా పట్టుబ డుతోంది. కానీ, ఆర్థిక వ్యవస్థ ప్రయోజ నాలను కాపాడేందుకు తాము శాయశక్తులా ప్రయ త్నిస్తామని రిజర్వుబ్యాంకు బోర్డు సభ్యుడొకరు వ్యాఖ్యా నించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. 

English Title
Ursjith Goodbye?
Related News