ఇదంతా కేసీఆర్ డ్రామా: ఉత్తమ్

Updated By ManamTue, 03/13/2018 - 12:43
Uttam Kumar

Uttam Kumar హైదరాబాద్: అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ నేతలపై వేటు వేయడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కేవలం తాము చేసిన ఆందోళనకు సంబంధించిన వీడియోను మాత్రమే విడుదల చేశారని.. ఆ హెడ్‌ఫోన్స్ తగిలాయో? లేదో దానికి సంబంధించిన వీడియోను మాత్రం ఎందుకు రిలీజ్ చేయలేదని విమర్శించారు. అయినా కోమటి రెడ్డి ఒకవైపు నుంచి హెడ్‌ఫోన్స్‌ను విసిరేస్తే.. అది ఎక్కడో ఉన్న చైర్మన్ కుడి కన్నుకు ఎలా తగులుతుందని ప్రశ్నించారు. మండలి చైర్మన్‌ అంటే తమకు గౌరవం ఉందని.. ఆయనపై అనుచితంగా ప్రవర్తించాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.

ఇక ఆసుపత్రిలో చేరమని సీఎం కేసీఆర్‌నే స్వామి గౌడ్‌కు చెప్పినట్లు ఆయనే ఒప్పుకున్నారని తెలిపారు. వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేయడం తమ తప్పైతే.. అప్పట్లో హరీశ్ రావు గవర్నర్‌పై దాడి కూడా చేశారని.. ఇప్పుడు కూడా పార్లమెంట్‌లో వారి పార్టీ ఎంపీలు, కేసీఆర్ కుమార్తె కవిత చేస్తున్నది ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ఆందోళనపై కనీసం కమిటీ కూడా వేయకుండా అందరినీ సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యంలో భాగమా అంటూ మండిపడ్డారు.

స్పీకర్ పదవికి ఆయన అప్రతిష్ట తెచ్చారు
స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని.. ఆ పదవికి మధుసూధనాచారి అప్రతిష్ట తీసుకొచ్చారని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మమ్మల్ని సస్పెండ్ చేసిన తరువాత కేసీఆర్‌కు మైక్ ఇచ్చి తిట్టించడం ఏంటని? ఏ స్పీకర్‌కు లేని ప్రత్యేక అధికారాలు మధుసూధనాచారికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. 

English Title
Uttam Kumar fire on KCR
Related News