అధికారంలోకి వస్తే ఎవర్నీ వదిలిపెట్టం..

Updated By ManamWed, 09/12/2018 - 16:50
uttam kumar reddy slams kcr over congress leaders terget
Uttam kumar reddy dares kcr, Will Congress come to power in elections

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టేది లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గాంధీభవన్‌లో పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్... కాంగ్రెస్ నేతలపై పెట్టిన అక్రమ కేసులను తీవ్రంగా ఖండించారు. 

ఆయన మాట్లాడుతూ...‘జగ్గారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. కేసు నమోదు అయింది 2005లో, కానీ సుమారు 13 ఏళ్ల తర్వాత ఎందుకు అరెస్ట్ చేశారు?. తెలంగాణ కాంగ్రెస్ నేతల జోలికి వస్తే సహించేది లేదు. మరో రెండు నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. మేం అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టం. 

బంగారు తెలంగాణ కాదు...కేసీఆర్ బంగారు కుటుంబమైంది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి బుద్ధి చెబుదాం. అక్రమ పాస్‌పోర్టు కేసులో కేసీఆర్, హరీశ్‌రావులు ముద్దాయిలు. పలువురు అధికారులు కేసీఆర్‌కు తొత్తులుగా మారారు. అధికారం ఉందికదా అని ఎక్కువ చేస్తే సహించేది లేదు. జరగబోయే ఎన్నికలు ప్రజలకు, టీఆర్ఎస్ పార్టీ మధ్యలోనే.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2లక్షలు రుణమాఫీ చేస్తాం. 58 ఏళ్లకే వృద్ధులకు ఫించన్ ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తాం. గుళ్లు, మసీదులు, చర్చిలకు ఉచిత కరెంట్. ప్రతి మహిళా సంఘానికి రూ.లక్ష గ్రాంట్ అందచేస్తాం.10 లక్షలమంది నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు’ ఇస్తామని హామీ ఇచ్చారు.

English Title
Uttam kumar reddy dares kcr, Will Congress come to power in elections
Related News