'ఆ మూడింటిలో తెలంగాణ నెంబర్‌వన్'

Updated By ManamThu, 09/06/2018 - 16:55
Uttam kumar reddy, KCR, Telangana govt, TPCC Cheif, Farmers suicides
  • మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ 

Uttam kumar reddy, KCR, Telangana govt, TPCC Cheif, Farmers suicidesహైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలను నాలుగున్నరేళ్లు కేసీఆర్ మోసం చేశారని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. భారతదేశంలో రైతుల ఆత్మహత్యల్లో, మద్యం అమ్మకాల్లో, అప్పులు చేయడంలో తెలంగాణ నెంబర్‌వన్‌ని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ మీడియా సమావేశంలో చెప్పినవన్నీ అబద్ధాలేనని అన్నారు. గురువారం ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్ స్థాయి మరిచి విజ్ఞత మరిచి మాట్లాడరని దుయ్యబట్టారు. నాలుగున్నరేళ్ల పాటు కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుందని ధ్వజమెత్తారు. బందిపోటు దొంగల్లాగా తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు. మాట ఇచ్చి మోసం చేసిన కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు.

డబుల్ బెడ్ రూం ఇళ్లు ముస్లిం రిజర్వేషన్లపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని విధాలుగా తెలంగాణ ప్రజల్ని కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. పోయేకాలం వచ్చి శాసనసభను రద్దు చేసుకున్నారని, ఎన్నికల కమిషన్ టీఆర్ఎస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందా? అని ఉత్తమ్ ఆరోపించారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చుట్టూ తిరిగి కాళ్లు పట్టుకున్న రోజులు మర్చిపోయారా? ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో మత ఘర్షణలు జరిగాయన్నది అవాస్తమని ఉత్తమ్ కొట్టిపారేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ముస్లింలను మోసం చేసిన కేసీఆర్‌ను గద్దె దించాలని ఉత్తమ్ విమర్శించారు. కాగా, శుక్రవారం ఉదయం 10.30 గంటలకు పీసీసీ కార్యవర్గ అత్యవసర సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితిపై టీపీసీసీ చర్చించనున్నట్టు తెలుస్తోంది.   

English Title
Uttam kumar reddy slams KCR govt
Related News