'అన్ని పార్టీలు ఏకమైతే కేసీఆర్ కనుమరుగు'

Updated By ManamSun, 09/09/2018 - 17:33
V Hanumanth rao, VH, KCR, TRS govt, Bharath bandh

V Hanumanth rao, VH, KCR, TRS govt, Bharath bandhహైదరాబాద్‌: అన్ని పార్టీలు ఏకమైతే కేసీఆర్ కనుమరుగు కావడం ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. కేసీఆర్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సెటిలర్లకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఈ నెల 10న చేపట్టనున్న భారత్‌ బంద్‌లో నిరసన తెలపాలని వీహెచ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఉద్యోగులు, వ్యాపారులు సహా అన్ని వర్గాల ప్రజలు సహకరించి బంద్‌‌ విజయవంతం చేయాలని కోరారు. సోమవారం సాయంత్రం వరకు బస్సులు తిప్పితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. శాంతిభద్రతల సమస్య వస్తే ప్రభుత్వానిదే బాధ్యతగా పేర్కొన్నారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు భయపడిన కేసీఆర్.. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీతో మళ్లీ రాష్ట్ర సీఎం కేసీఆరే అవుతారని చెప్పించారని విమర్శించారు. 

English Title
V Hanumantha rao slams KCR
Related News