వాజ్‌పేయి రాజకీయ భీష్ముడు

Updated By ManamThu, 09/06/2018 - 22:13
chandra babu naidu
  • తెలుగువారంటే ఇష్టం, ఎన్టీఆర్‌కు సన్నిహితుడు

  • నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన నేత

  • కొనియాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

  • తొలి రోజు సభలో మాజీ ప్రధాని సంతాప తీర్మానం

chandrababuఅమరావతి: లోక్‌సభకు 11 సార్లు, రాజ్యసభకు  రెండు సార్లు ప్రాతినిధ్యం వహించి నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాలను శాసించిన మహానీయుడు అటల్ బిహారీ వాజ్‌పేయి రాజకీయ భీష్ముడిగా అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనియాడారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు తొలిరోజు గురువారం వాజ్‌పేయి మృతికి సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. రాజకీయ నాయకులకు మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆదర్శమని, అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో మరొకరు లేరని ఆయన ప్రశంసించారు. భారతదేశం మంచి నాయకుడుని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రత్యేక వ్యక్తిగా, దేశ ప్రధానిగా అనేక సంస్కరణలు తెచ్చి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని సీఎం గుర్తుచేశారు. దేశ రాజకీయాలపై, సవుస్యలపై ఎంతో పరిజ్ఞానం కల్గిన వ్యక్తి అని చంద్రబాబు కొనియాడారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌తో వాజ్‌పేయి చాలా సన్నిహితంగా ఉండేవారని, రాష్ట్రంలో ఆగస్టు సంక్షోభం జరిగి ప్రజాస్వామ్యం అపహాస్యం చేసినప్పుడు ఆయన ఏపీకి వచ్చి ఆ ఘటనను తీవ్రంగా ఖండించారని గుర్తుచేశారు. వాజ్‌పేయికి తెలుగువారంటే అమితమైన ప్రేమ అని, తెలుగుదేశం పార్టీ నేతలతోనూ చాలా అభిమానంగా ఉండేవారని ఆయన చెప్పుకొచ్చారు. వాజ్‌పేయి ప్రధానిగా అధికారంలో ఉన్నప్పుడు తాను అనేక సార్లు ఆయనతో విభేదించానని, అయినా వాటిని ఏమీ పట్టించుకోకుండా పెద్దరికంగా వ్యవహరించేవారని సీఎం కొనియాడారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడే దేశంలో విదేశాలను తలదన్నేలా జాతీయ రహదారులు వేయించారని, టెలీకమ్యూనికేషన్ రంగంలో పెనుమార్పులు జరిగాయని గుర్తుచేశారు. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన మహానీయుడని, రాష్ట్రపతిగా వైునార్టీ నేత అబ్దుల్ కలాంను నిలబెట్టి మతసావురస్యాన్ని వాజ్‌పేయి కాపాడారని ప్రశంసించారు. పోక్రాన్ అణుపరీక్ష, కార్గిల్ యుద్ధం, పాకిస్తాన్‌కు బస్సు యాత్ర  తదితర సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి వాజ్‌పేయి అని చంద్రబాబు కొనియాడారు. కాగా శాసనమండలిలో వాజ్‌పేయి మృతికి సంతాప తీర్మానాన్ని ఆర్థిక మంత్రి యనమల రావుకృష్ణుడు ప్రవేశపెట్టారు. 

పేదలకు మెరుగైన వైద్యం  
ఆరోగ్య ఉపకేంద్రాలను ఆధునీకరించి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గురువారం నాడు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని అన్ని ఆరోగ్య ఉపకేంద్రాలు శిథిలావస్థలో ఉన్నాయని, వాటన్నింటిని నిర్మాణాలను దశల వారీగా ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు. ప్రపంచ బ్యాంకు సాయంతో రాష్ట్రంలోని అన్ని ఆరోగ్య ఉపకేంద్రాలను అత్యాధునిక వైద్య పరికరాలు ఉండేలా చేస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 13 జిల్లాలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు. వాటిలో  ఫార్మాసిస్టు గ్రేడ్ 2- 329 ఖాళీలు, పారావెుడికల్ ఆఫ్తాల్మిక్ అధికారి- 10, స్టాప్ నర్స్‌లు 1497, ఎంపీహెచ్‌ఎ(ఎఫ్)- 1693, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ -2- 364, రేడియోగ్రాఫర్-71, ఎంపీహెచ్‌ఎ(ఎం)-2055 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా వైద్య అధికారుల నిర్లక్ష్యం వల్లే విశాఖ, విజయనగరంలో డెంగ్యూ వ్యాధి ప్రబలిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి డెంగ్యూ కేసును జియో ట్యాగింగ్ చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. పేదలకు వైద్య సహాయం చేయడంలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు.

వీళ్లు మారరా..?
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తమ పార్టీకి చెందిన పలువురు సభ్యులపై కోపం వచ్చింది. గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు హాజరయ్యే ముందు సచివాలయానికి సమీపంలోని వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 140 మంది సభ్యులు పాల్గొనాలని ముందురోజు చంద్రబాబు చెప్పారు. అయితే ఎన్టీఆర్ నివాళుల కార్యక్రమానికి 15 మంది మాత్రమే హాజరయ్యారు. మంత్రులు దేవినేని ఉమా,  అచ్చెన్నాయుడు, జవహర్, లోకేశ్‌తో పాటు ఎమ్మెల్యే చాంద్‌బాషా, యామిని బా, ఎమ్మెల్సీ కరణం బలరామ్ తదితరులు ఉన్నారు. తాను రమ్మని గట్టిగా చెప్పినా హాజరుకాకపోవడంతో సీఎం అసహనం వ్యక్తం చేశారు. పదవులు వచ్చాక మాట వినడం లేదని మండిపడ్డారు. ఇలాగే వ్యవహరిస్తే రానున్న ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం అనవసరమంటూ పెదవివిరిచారు. కొత్తవారైనా క్రమశిక్షణతో మెలిగేవారికే టికెట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. బుధవారం జరిగిన విసృ్తత స్థాయి సమావేశంలో ఇదే విషయమై చర్చించినా ఇంత నిర్లక్ష్యంగా ఉండడం ఏమిటంటూ హాజరైన నేతలతో చంద్రబాబు చర్చించారు.

English Title
Vajpayee is a political bishop
Related News