వాళ్లేనా?

Updated By ManamSun, 09/23/2018 - 07:25
actors

పాత్రల కోసం నటులు ఏం చేయడానికైనా సిద్ధపడుతున్న రోజులివి. ఆ పాత్రగా మారిపోవడంలో భాగంగా రూపం మార్చుకోడానికీ, ఎంత కష్టమైనా పడడానికీ నటులు ముందుకొస్తున్నారు. ఒక్కోసారి ఆ పాత్ర చేసింది ఫలానా నటుడు లేదా నటి అని చెప్తే తప్ప గుర్తుపట్టలేకపోతున్నాం. ఇప్పుడు హాలీవుడ్‌లో కొంతమంది తారలు చేస్తున్న పాత్రలు చూస్తుంటే, వాటిలో వాళ్ల రూపం చూస్తుంటే అది వంద శాతం నిజమనిపిస్తోంది. అలా పాత్ర కోసం రూపం మారిన కొంతమంది నటులపై 
ఓ లుక్కేద్దాం...

మార్గొట్ రాబీ 
(మేరీ క్వీన్ ఆఫ్ స్కాట్స్)

image


ఈ హిస్టారికల్ డ్రామాలో క్వీన్ ఎలిజిబెత్ 1గా మార్గొట్ రాబీని ఎంపిక చేసినప్పుడు చాలా సాధారణంగా కనిపించే రాణి పాత్రలో సౌందర్యరాశి అరుున ఆమె ఎలా సరిపోతుందనే విమర్శలు వినిపించారుు. అరుుతే ఎప్పుడైతే ఎలిజిబెత్‌గా ఆమె లుక్ బయటకొచ్చిందో, అప్పుడు ఆ విమర్శలన్నీ సద్దుమణిగిపోయూరుు. పెద్ద విగ్గు, హెవీ పౌడర్‌ఫేస్‌తో రాబీ పూర్తిగా ఆ పాత్రలోకి వెళ్లిపోయూరనే ఆమోద ముద్ర లభించింది. ‘టెర్మినల్’, ‘ఐ, టోన్యా’, ‘సూసైడ్ స్క్వాడ్’ సినిమాలతో మెప్పించిన రాబీ, త్వరలో ఎలిజిబెత్ రాణిగానూ మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు.

నికోల్ కిడ్‌మన్ (డిస్ర్టాయర్)
 

image


హాలీవుడ్‌లోని అత్యంత సౌందర్యరాశుల్లో ఒకరిగా నికోల్ కిడ్‌మన్‌కు పేరుంది. అలాంటిది కరీన్ కుసమ డైరెక్ట్ చేస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘డిస్ర్టాయర్’లో ఆమె డీగ్లామరస్‌గా మారిపోయూరు. ఎరిన్ బెల్ అనే అండర్‌కవర్ డిటెక్టివ్‌గా అందమైన తన ఉంగరాల జుట్టు స్థానంలో షార్ట్ బ్రౌన్ విగ్, మురికిగా కనిపించే ముఖంతో గుర్తుపట్టలేనంతగా మారిపోయూరు. ఈ మద్యే ‘లయన్’, ‘ద బిగైల్డ్’, ‘ది అప్‌సైడ్’ సినిమాల్లోని పాత్రలతో ఆకట్టుకున్న ఆమె ‘డిస్ర్టాయర్’తో ఆస్కార్ అవార్డ్ సాధించినా ఆశ్చర్యపోవాల్సింది లేదనేది 
విశ్లేషకుల మాట.

టామ్ హార్డీ (ఫోన్జో)
imageపాత్రల కోసం రూపం మార్చుకోవడం టామ్ హార్డీకి కొత్తేం కాదు. ఇదివరకు ‘బ్రాన్సన్’గా, ‘ద డార్క్‌నైట్ రైజెస్’లో క్రూర విలన్ బేన్‌గా టామ్ విశేషంగా రాణించారు. ఇప్పుడు ‘ఫోన్జో’ సినిమా కోసం రియల్ లైఫ్ కేరక్టర్ మాఫియూ డాన్ అల్ కపోనేగా మారిపోయూరు. చివరి దశలో డిమెన్షియూ వ్యాధితో బాధపడిన కపోనే పాత్రలో టామ్ నటన గొప్పగా ఉందంటున్నారు. సిగార్ తాగుతూ డిఫరెంట్ మేకప్‌తో ఇప్పటివరకూ ఆన్‌లైన్‌లో బయటకు వచ్చిన ఆయన లుక్ మార్లన్ బ్రాండో (‘గాడ్‌ఫాదర్’)ను గుర్తుకు తెస్తున్నదని సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు.

షియూ లాబ్యూఫ్ (హనీ బాయ్)
image‘అమెరికన్ హనీ’, ‘ఫ్యూరీ’, ‘నింఫోమేనియూక్’ వంటి సినిమాలతో హాలీవుడ్ సినీ ప్రేక్షకులకు సుపరిచితుడైన షియూ లాబ్యూఫ్ ఇప్పుడు ‘హనీ బాయ్’ పాత్రలో సరికొత్త రూపంతో కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. విశేషమేమంటే ఆయన ఈ సినిమాలో చేస్తోంది స్వయంగా ఆయన తండ్రి పాత్రనే. హనీ బాయ్ అనేది చిన్నతనంలో ఆయన ముద్దుపేరు. తన తండ్రికీ, తనకూ మధ్య ఉన్న అనుబంధంతో షియూ రాసిన స్క్రిప్టుతోటే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ముందు కాస్త బట్టతల, వెనుక పెరిగిన జుట్టు, పెద్ద కళ్లద్దాలు, డెనిమ్ డ్రెస్‌లో తన అందమైన రూపానికి భిన్నంగా ఈ పాత్రలో కనిపించనున్నారు షియూ.

డేవిడ్ హార్బర్ (హెల్‌బాయ్)
image‘స్ర్టేంజర్ థింగ్స్’ స్టార్ డేవిడ్ హార్బర్ తాజా ‘హెల్‌బాయ్’ రీమేక్‌లో టైటిల్ రోల్ పోషించే అవకాశం సంపాదించడంతో చాలా మంది ఆశ్చర్యపోయూరు. ఆన్‌లైన్‌లో ఆయన ఫస్ట్‌లుక్ బయటకు వచ్చినప్పుడు ‘హెల్‌బాయ్’ అభిమానులు కన్విన్స్ అయ్యూరు. 2004, 2008 సంవత్సరాల్లో వచ్చిన ‘హెల్‌బాయ్’, ‘హెల్‌బాయ్ 2’ సినిమాల్లో ఈ సూపర్ హీరో కేరక్టర్‌ను రాన్ పెరిమన్ పోషించి, అశేష అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు కండలు తిరిగిన దృఢమైన శరీరంతో హార్బర్ ఆ కేరక్టర్ లుక్‌లో షాక్‌కు గురిచేశారు. ఎందుకంటే ఇప్పటివరకూ ఆయన కండలు తిరిగిన దేహంతో కనిపించలేదు మరి.

English Title
Vallena?
Related News