'ఆయన చెప్పినట్టే వైఎస్ఆర్సీపీ నడుస్తోంది'

Updated By ManamThu, 04/26/2018 - 16:20
Varla Ramaiah, Central govt, Amith shah, YSRCP, Modi govt

Varla Ramaiah, Central govt, Amith shah, YSRCP, Modi govtవిజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య విమర్శించారు. గురువారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని బీజేపీ నేతలను వైఎస్సార్ సీపీలో చేర్చుకోవద్దని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. జగన్‌కు ఫోన్ చేయడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. వైసీపీలో చేరాలనుకున్న కన్నా లక్ష్మీనారాయణ ఆరోగ్యం బాగోలేదంటూ ఆస్పత్రిలో చేరడం వెనుక అమిత్ షా ఉన్నది నిజం కాదా? అనే ప్రశ్నను సూటిగా సంధించారు.

వైఎస్ జగన్ చెప్పినట్టు కాకుండా అమిత్ షా చెప్పినట్టు వైఎస్సార్ సీపీ నడుస్తోందని ఆరోపించారు. విభజన హామీలు, ప్రత్యేక హోదాను అమలు చేయాల్సింది చంద్రబాబు కాదని.. కేంద్ర ప్రభుత్వమని అన్నారు. జగన్ కేసులపై ఏం తెలుసని కేంద్రమంత్రి రాందాస్ వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఎన్డీయేలోకి ఆహ్వానిస్తామంటూ వ్యాఖ్యానించారని వర్ల రామయ్య విమర్శించారు.

English Title
Varla Ramaiah slams Central govt
Related News