భార్య బాధితులుగా...

Updated By ManamSat, 08/11/2018 - 19:08
Varun tej, Victory Venkatesh, Dilraju, F2, Anil ravipudi, 

Varun tej, Victory Venkatesh, Dilraju, F2, Anil ravipudi, అగ్ర కథానాయకుడు వెంకటేశ్, యువ కథానాయుకుడు వరుణ్‌తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ ట్యాగ్ లైన్‌. అనిల్ రావిపూడి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేుషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తిస్థాయి ఎంట‌ర్‌టైనర్‌గా సినిమాను రూపొందిస్తామని దర్శక నిర్మాతలు ముందు నుండే చెబుతున్న సంగతి తెలిసిందే.

ఇందులో వెంకటేశ్, వరుణ్‌తేజ్ భార్యా బాధిత భర్తల పాత్రల్లో కనిపిస్తారు. భార్యల పెట్టే ఇబ్బందులతో ఫ్రస్ట్రేట్ అయిపోయి వీరిద్ద‌రూ బ్యాంకాక్ వెళతారు. అక్కడ వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయునేదే అసలు కథట. ఈ చిత్రంలో వెంకటేశ్ జోడిగా తమన్నా.. వరుణ్ తేజ్ జోడిగా మెహరీన్ నటిస్తున్నారు. 

English Title
Varun tej and Venkatesh combination film as Wife victims 
Related News