అంతరిక్షంలో వరుణ్, లావణ్య

Updated By ManamMon, 09/24/2018 - 16:00
Anthariksham

Varun, Lavanyaవరుణ్ తేజ్ కథానాయకుడిగా ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘అంతరిక్షం’. స్పేస్ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ సరసన అదితీరావు హైదారీ, లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నుంచి తాజాగా వరుణ్, లావణ్యకు సంబంధించిన ఓ లుక్‌ను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో వరుణ్, లావణ్యలు చిన్నపిల్లలతో కలిసి ఉన్నారు. చూస్తుంటే లావణ్య ఇందులో టీచర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ క్లైమాక్స్‌కు రాగా.. మిగిలిన కార్యక్రమాలను పూర్తి చేసుకొని డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజీవ్ రెడ్డి, సాయిబాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిదా, తొలిప్రేమ సినిమాలతో వరుసగా రెండు హిట్లను కొట్టిన వరుణ్.. ఈ చిత్రంలో హ్యాట్రిక్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు.

English Title
Varun Tej, lavanya Tripathi look release from Anthariksham
Related News