వెంకీ మామ కొత్త సినిమా!

Updated By ManamWed, 09/26/2018 - 02:04
venkatesh

imageఈమధ్యకాలంలో తెలుగు హీరోలు మల్టీస్టారర్స్‌పైన ఆసక్తి చూపిస్తున్నారు. దానికి ఉదాహర నాగార్జున. ఇప్పుడు వెంకటేష్ కూడా అదే దారిలో వెళ్తున్నారు. వరుణ్‌తేజ్‌తో ఎఫ్2 చేస్తున్నారు. త్వరలోనే నాగచైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ సినిమాలో నటించనున్నారు. ఈ మల్టీస్టారర్స్ ఇలా ఉంటే త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ ఓ సినిమా చేయబోతున్నారు.
 
ఇవి కాక మరో రేర్ ప్రాజెక్ట్‌కి వెంకటేష్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. బొమ్మరిల్లుతో ఒక ట్రెండ్‌ని క్రియేట్ చేసిన భాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్ ఓ సినిమా చేయబోతున్నారన్న వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది. బొమ్మరిల్లు తర్వాత పరుగు ఓకే అనిపించినా ఆ తర్వాత చేసిన ఆరెంజ్, ఒంగోలు గిత్త ఘోర పరాజయాన్ని చవిచూశాయి. దీంతో డైరెక్టర్‌గా భాస్కర్ వెనకబడిపోయాడు. చాలా గ్యాప్ తర్వాత మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు భాస్కర్. వెంకటేష్‌కి ఓ లైన్ చెప్పి ఒప్పించారు. ప్రస్తుతం వెంకటేష్ చేస్తున్న సినిమాలు పూర్తయిన తర్వాత భాస్కర్ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

English Title
venkatesh new movie
Related News