వర్మ రాజీనామా

alok varma
  • అగ్నిమాపక శాఖ డీజీగా నియామకం

  • అవమానభారంతో తప్పుకొన్న అలోక్

  • ఈనెల 29న అలోక్‌వర్మ పదవీవిరమణ

  • ఈలోపే ఉద్యోగం వదులుకున్న అధికారి

  • మళ్లీ సీబీఐ డైరెక్టర్‌గా ఎం.నాగేశ్వరరావు

  • అలోక్ వర్మ తీసుకున్న నిర్ణయాలు రద్దు

  • రాకేశ్ ఆస్థానా అరెస్టుకు హైకోర్టు ఆదేశం

  • 10 వారాల్లోగా విచారణ: సీబీఐకి సూచన

న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి ఉద్వాసనకు గురై.. అగ్నిమాపక శాఖ ప్రధానాధికారిగా బదిలీ అయిన అలోక్ వర్మ.. ఆ బాధ్యతలు స్వీకరించేందుకు నిరాకరించి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయాల్సి ఉన్న అలోక్ వర్మ.. ఈలోపు జరిగిన పరిణామా లలో సుప్రీంకోర్టులోనూ ఊరట లభించినట్లే లభించి 48 గంటల్లోనే తన పదవిని పోగొట్టుకోవాల్సి రావడంతో అవమానభారంతో తన ఉద్యోగాన్ని వదులుకున్నారు. సీబీఐ చీఫ్ పదవి నుంచి తప్పించిన తర్వాత అలోక్ వర్మను అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్‌గా అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేశారు. ఆయన ఆశించినంత న్యాయవర్తన చూపించలేదని, అందు వల్లే ఆయనను బదిలీ చేయాల్సి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని హైపవర్ కమిటీ తెలిపింది. అలోక్ వర్మ జనవరి 29వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉంది. సహజ న్యాయం కుంటుప డిందని, సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తనను తప్పించే క్రమంలో మొత్తం వ్యవస్థ అంతా తలకిందులైందని ఈ సందర్భంగా అలోక్ వర్మ తాను విడుదల చేసిన ఓప్రకటనలో అన్నారు. సుప్రీంకోర్టు తనను సీబీఐ చీఫ్ పదవిలో నియమించిన రెండు రోజుల్లోనే వర్మ ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. గత సంవత్సరం అక్టోబరు నెలలో అర్ధరాత్రి సమయంలో ఆయన ను బలవంతంగా సెలవు మీద పంపా రు. ఆయన బృందంలో ఉన్న అధికా రులలో పలువురిని ఆ తర్వాత తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఎం. నాగేశ్వరరావు బదిలీ చేశారు. తనను బలవంతపు సెలవుపై పంపడాన్ని అలోక్ వర్మ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సీబీఐ డైరెక్టర్ పదవిలో ఎవరైనా రెండేళ్ల పాటు ఉండాలని, కేవలం ప్రధానమంత్రి నేతృత్వంలోని హైపవర్ కమిటీ మాత్రమే తనను తొలగించగలదని ఆయన వాదించారు. దాంతో కోర్టు ప్రభుత్వ ఉత్తర్వులను రద్దుచేసింది. కానీ.. ఆయనను పదవిలో ఉంచాలా లేదా అన్న విషయాన్ని ప్రధానమంత్రి, అతిపెద్ద ప్రతిపక్షం నాయకుడు, ప్రధాన న్యాయమూర్తితో కూడిన  హైపవర్ కమిటీ నిర్ణయించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఈ కమిటీకి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ స్థానంలో ఆయన ప్రతినిధిగా నియమించిన జస్టిస్ ఏకే సిక్రీ హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు జస్టిస్ సిక్రీ కూడా వర్మను సాగనంపేందుకే మొగ్గు చూపారు. కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మాత్రం విజిలెన్స్ నివేదికలో వర్మ లంచం తీసుకున్నట్లు రుజువు కాలేదంటూ డిసెంట్ నోట్ ఇచ్చారు. దాంతో వర్మను పదవి నుంచి తొలగించారు. 

బదిలీలు రద్దు
అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తప్పించిన మర్నాడే.. అదనపు డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు మరోసారి ఆ బాధ్యతలు శుక్రవారం స్వీకరించారు. గడిచిన రెండు రోజుల్లో అలోక్ వర్మ తీసుకున్న నిర్ణయాలన్నింటినీ ఆయన రద్దుచేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో తిరిగి సీబీఐ డైరెక్టర్‌గా పదవి చేపట్టేందుకు వచ్చిన అలోక్ వర్మను స్వయంగా నాగేశ్వరరావే సీబీఐ ప్రధాన కార్యాలయ ప్రవేశద్వారం వద్ద స్వాగతించారు. వర్మ పదవి చేపట్టగానే అంతకుముందు నాగేశ్వరరావు చేసిన బదిలీలన్నింటినీ రద్దుచేయడంతో పాటు కొత్తగా ఐదుగురు అధికారులను బదిలీ చేశారు. ఇప్పుడు నాగేశ్వరరావు మళ్లీ ఆ ఉత్తర్వులన్నింటినీ కొత్త డైరెక్టర్ హోదాలో రద్దుచేశారు. 1986 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐపీఎస్ అధికారి అయిన నాగేశ్వరరావును సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించాలని సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ కోరింది. ఇంతకుముందు అక్టోబరు 23వ తేదీ తెల్లవారుజామున 2 గంటల సమయంలో నాగేశ్వరరావు ఒకసారి సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 

Tags

సంబంధిత వార్తలు