అతి త్వరలో కియా మోటార్స్ ‘మేడిన్ ఆంధ్రా’ కారు!

Updated By ManamMon, 02/12/2018 - 02:04
kia-motors

kia-motorsన్యూఢిల్లీ: కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ త్వరలోనే ‘మేడిన్ ఆంధ్రా’ కారును మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఈ వాహనాన్ని ఢిల్లీలో జరుగుతోన్న ఆటో ఎక్స్‌పో 2018లో ప్రదర్శనకు ఉంచింది. 2019 మధ్యలో కియా మోటార్క్‌కు చెందిన కాన్సెప్ట్ కంపాక్ట్ ఎస్‌యూవీ భారత మార్కెట్లోకి పరుగులు పెట్టనుంది. భారతీయుల కోసమే ప్రత్యేకంగా వాహనాన్ని తయారు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇది ఎస్‌పీ కాన్సెప్ట్ మోడల్‌కు దగ్గరగా ఉండనుందని కియా మోటార్స్ ఇండియా గ్రూప్ హెడ్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) మనోహర్ భట్ తెలిపారు. కార్ల ఉత్పత్తిలో కియా మోటార్స్ ప్రపంచంలో 8వ స్థానంలో ఉంది. కొరియాకు చెందిన కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో కార్ల ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతోన్న కార్ల మార్కెట్లో ఒకటైన భారత్‌లో కియా మోటార్స్ 1.1 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెడుతోంది. ఏడాదికి 3 లక్షల యూనిట్ల కార్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టేందుకు కూడా కియా మోటార్స్ ఆసక్తి చూపుతోంది. 2025 నాటికి 16 ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని కియా మోటార్స్ గ్లోబలల్ సీఈఓ హెచ్‌డబ్ల్యూ పార్క్ తెలిపారు.

Tags
English Title
Very soon Kia Motors' Madin Andhra!
Related News