‘అమ్మ’ వీడియో నిజమైనది: వెట్రివేల్

Updated By ManamFri, 08/03/2018 - 09:06
vetrivel

vetrivel చెన్నై: ఆసుపత్రిలో జయలలిత చికిత్స తీసుకునే సమయంలో టీవీ చూస్తూ జ్యూస్ తాగుతున్నట్లుగా విడుదలైన వీడియో మార్ఫింగ్‌ కాదని టీటీవీ దినకరన్‌ మద్దతుదారుడు వెట్రివేల్‌ తెలిపారు. ఆ వీడియో నకిలీదంటూ విచారణ కమిషన్ తేల్చగా, దీనిపై స్పందించిన వెట్రివేల్.. కమిషన్ కార్యదర్శి కోమల అసత్య ప్రచారం చేసి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఆమె ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి సన్నిహితురాలని, అందుకే ఆ వీడియోపై తప్పుదారి పట్టించేందుకు చూస్తున్నారని పేర్కొన్నారు.

అయితే జయలలిత మృతిపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆ వీడియోను కమిషన్‌కు అప్పగించకుండా నేరుగా మీడియాకు విడుదల చేయడంతో వెట్రివేల్‌పై అప్పట్లో కేసు నమోదు చేశారు. దీంతో ఆయన ముందస్తు బెయిల్‌ పొందడంతోపాటు ఆ వీడియోను విచారణ కమిషన్‌కు అప్పగించారు. ఈ నేపథ్యంలో అది మార్ఫింగ్‌ చేసిన వీడియోగా విచారణ కమిషన్‌ గుర్తించిందనే వార్తలు తెరపైకి వచ్చాయి. దీనిపై వెట్రివేల్‌ మరోమారు స్పందించారు. తాను వీడియో విడుదల చేసి 9 నెలలైందని.. అది మార్ఫింగ్‌ చేసిన వీడియో అయితే తనను ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఆ వీడియోను ఇంకా ఫోరెన్సిక్‌ పరిశోధనకు పంపలేదని వెట్రివేల్ అన్నారు.

English Title
Vetrivel on Jayalalithaa hospital video
Related News