విజయం మనదే

Updated By ManamSat, 09/08/2018 - 22:30
BJP
  • 2014 కన్నా ఎక్కువ మెజారిటీతో విజయఢంకా మోగిస్తాం

  • విపక్షాల ‘మహాఘట్‌బంధన్’ ఉత్తిదే

  • వాటికి ఓటమి తప్పదు: అమిత్‌షా

BJPన్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మరోసారి విజయఢంకా మోగిస్తుందని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా విశ్వాసం వ్యక్తం చేశారు. 2014లో సాధించినదానికన్నా ఎక్కువ మెజారిటీతో విజయం సాధిస్తామని అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోన విపక్షాల మహాఘట్‌బంధన్ గురించి ఎవరూ ఆందోళన చెందొద్దని, అది ఉత్తుత్తి ఘట్ బంధన్ అని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆ కూటమిలోని పార్టీలన్నీ ఓడిపోక తప్పదన్నారు.  బీజేపీ కార్యవర్గ సమావేశం ప్రారంభోత్సవంలో అమిత్‌షా మాట్లాడారు. ‘మేకిన్ ఇండియా’ చేయాలని బీజేపీ చూస్తుంటే.. ‘బ్రేకింగ్ ఇండియా’కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు.  దేశంలోని అన్నివర్గాలకూ బీజేపీ అండగా నిలుస్తుందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ ప్రతినిధులకు సూచించారు. కాగా, ఎస్సీ, ఎస్టీలకు బీజేపీ వ్యతిరేకమనే భావనను తొలగించాలనే ఉద్దేశంతో కార్యవర్గ సమావేశాలను ఇక్కడి అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో నిర్వహించడం గమనార్హం.

English Title
Victory is ours
Related News