వీడియో: బైక్ రైడర్‌ను నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లిన బస్సు డ్రైవర్

Updated By ManamSun, 06/17/2018 - 15:35
Bus driver, Middle of the road, Bike rider, Traffic, Hassan district

Bus driver, Middle of the road, Bike rider, Traffic, Hassan districtనడిరోడ్డుపై ట్రాఫిక్‌లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఓ బైక్ రైడర్‌ను కొట్టుకుంటూ తీసుకెళ్లాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలో ఎవికె కాలేజీ ఎదుట చోటుచేసుకుంది. ఏం జరిగిందో తెలియదు గానీ, అందరూ చూస్తుండగానే రోడ్డుపక్కన ఫుట్‌పాత్‌ వద్ద నుంచి ఆ యువకుడి చొక్కా పట్టుకొని కొట్టుకుంటూ బస్సులోకి లాక్కెళ్లారు. అందులో ఒక డ్రైవర్ వద్ద ఉన్న ప్యాసెంజర్ టికెట్ మిషన్ సరిచేసుకుంటూ యువకుడిని కొడుతున్నట్టు వీడియోలో కనిపిస్తోంది. ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడో.. బస్సు డ్రైవర్ ఎందుకు అతన్ని కొట్టుకుంటూ ఈడ్చుకెళ్తున్నాడో కారణం తెలియనప్పటికీ.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే ఆ వీడియో.. 

English Title
Video: Bus driver beats up bike rider in the middle of the road 
Related News