‘య‌న్.టి.ఆర్’ బ‌యోపిక్‌లో విద్యా బాల‌న్‌?

Updated By ManamTue, 03/13/2018 - 19:28
vidya

vidyaస్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితకథ ఆధారంగా తేజ దర్శకత్వంలో ‘య‌న్.టి.ఆర్’ పేరుతో సినిమా ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ మార్చి నెలాఖరులో ప్రారంభం కానుంది.  

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. ఎన్.టి.రామారావు సతీమణి బసవతారకం పాత్ర కోసం ఎంతో మంది పేర్లను పరిశీలించిన చిత్ర యూనిట్.. చివరికి బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్‌ను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 

English Title
vidya balan in 'n.t.r' biopic




Related News