ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా: విజయ్ దేవరకొండ

Updated By ManamFri, 08/24/2018 - 13:28
Vijay Devarakonda

Vijay Devarakonda‘గీత గోవిందం’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ తన పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 40ఏళ్లకు పెళ్లి చేసుకోవాలని ముందు అనుకున్నానని, అయితే ఇప్పుడు దానిని 35కు తగ్గించానని విజయ్ చెప్పుకొచ్చాడు. 

తన మైండ్ సెట్‌కు పెద్దలు కుదిర్చిన పెళ్లి సెట్ అవ్వదని, అందుకే ప్రేమ వివాహాన్నే చేసుకుంటానని పేర్కొన్నాడు. ‘‘ఆమె తెలంగాణకు చెందిన అమ్మాయి అవ్వొచ్చు, కాకపోవచ్చు, ఏ దేశం అమ్మాయి అయినా ఉండొచ్చు. ముందు మేమిద్దరం కనెక్ట్ అవ్వాలి. ఒకరినొకరు తెలుసుకోవాలి. గీత గోవిందంలో తన పాత్ర గోవిందం తరహాలో ప్రత్యేకమైన కోరికలు ఏవీ నాకు లేవు’’ అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు.

English Title
Vijay Devarakonda about his marriage
Related News