బాలీవుడ్‌కు విజయ్ దేవరకొండ..?

Updated By ManamWed, 09/19/2018 - 11:16
Vijay Devarakonda

Vijay Devarakondaఅదృష్టం మన వెంట వచ్చినప్పడు ఒక్కటి.. ఒక్కటంటే ఒక్క సినిమా చాలు.. మామూలు హీరోలు ఓవర్‌నైట్ స్టార్లు అవ్వడానికి. అలాంటిది ఆ హీరోకు మూడు మంచి హిట్లు పడ్డాయి. ఒకదానికొకటి సంబంధం లేకుండా వచ్చిన ఈ చిత్రాలతో సెన్సేషనల్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు టాలీవుడ్‌లో ఇతడో సెన్సేషన్. ఇతడితో చిత్రాలు తీసేందుకు దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు.

మరోవైపు ‘నోటా’ చిత్రంతో కోలీవుడ్‌లో తన సత్తాను చూపించబోతున్న విజయ్ దేవరకొండ.. ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్, విజయ్ దేవరకొండతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి బాలీవుడ్ ద్వయం రాజ్, డీకే దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

English Title
Vijay Devarakonda make debut in Bollywood..?
Related News