విజయ్ దేవరకొండ కొత్త చిత్రం

Updated By ManamSat, 10/20/2018 - 00:20
Devarakonda new film

విజయ్ దేవరకొండ, క్రాంతిమాధవ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం షూటింగ్ దసరా సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్‌పై కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రాంతి మాధవ్ దర్శకుడు. ఈ కార్యక్రమానికి టి సుబ్బరామిరెడ్డి, నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్, బివిఎస్‌ఎన్ ప్రసాద్, సి కళ్యాణ్.. దర్శకులు కె.రాఘవేంద్రరావు, నాగ్ అశ్విన్ ముఖ్య అతిథులుగా విచ్చేసారు.

image


టి సుబ్బరామిరెడ్డి హీరో హీరోయిన్లపై తొలి షాట్‌కు క్లాప్ కొట్టగా.. అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. తొలి షాట్‌ను కె.రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు. ఈ ప్రేమకథాచిత్రంలో రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇసాబెల్లెడి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, సినిమాటోగ్రఫీ: జె.కె.

English Title
Vijay Devarakonda new film
Related News