జూన్ రెండో వారం నుంచి విజ‌య్ కొత్త చిత్రం

Updated By ManamMon, 04/16/2018 - 16:01
vd

vijay devarakondaప్ర‌స్తుతం చేతి నిండా సినిమాల‌తో బిజీగా ఉన్న యువ‌ క‌థానాయ‌కుల్లో యూత్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక‌రు.  ఆయ‌న‌ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో నటించిన ‘మహానటి’ మే 9న విడుదల కానుండగా.. సైంటిఫిక్ థ్రిల్లర్ ‘టాక్సీవాలా’ మే 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే.. పరశురామ్ దర్శకత్వంలో విజయ్, రష్మిక మందన్న జంటగా  తెరకెక్కిన సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. మెగా నిర్మాత అల్లు అరవింద్ నిర్మించిన ఈ మూవీకి ‘గీత గోవిందం’ అనే పేరు ప్రచారంలో ఉంది. ఇక‌.. విజ‌య్ న‌టిస్తున్న బైలింగ్వల్ (తెలుగు, తమిళం) ఫిల్మ్‌ ‘నోటా’ చిత్రీకరణ ద‌శ‌లో ఉంది.

ఈ చిత్రాల‌తో పాటు కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు విజయ్. ఈ చిత్రంలో రష్మిక మరోసారి విజయ్‌తో కలిసి ఆడిపాడనుంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ కాలేజీ స్టూడెంట్‌గానూ, రష్మిక క్రీడాకారిణిగానూ కనిపించ‌నున్నార‌ని స‌మాచారం. తాజా స‌మాచారం ప్ర‌కారం.. జూన్ రెండో వారం నుంచి ఈ మూవీ నిరవధికంగా చిత్రీకరణ జరుపుకోనుంద‌ని తెలిసింది.

English Title
vijay devarakonda new film from june second week
Related News