విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. న‌యా లుక్ అదుర్స్‌

Updated By ManamTue, 03/13/2018 - 21:51
vijay

vijay devarakonda'అర్జున్ రెడ్డి'తో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయారు యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్నారు. తాజాగా 'నోటా' పేరుతో ఓ ద్విభాషా చిత్రాన్ని కూడా సెట్స్ పైకి తీసుకు వెళ్ళారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు (మంగ‌ళ‌వారం) విజ‌య్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో 'డిజైర్డ్' అంటూ ఓ స్టిల్‌ను పోస్ట్ చేశారు. అందులో.. విజ‌య్ లుక్ చాలా స్టైలీష్‌గా ఉంది. మ‌రి ఈ లుక్ సినిమా కోస‌మా? లేకుంటే యాడ్ కోస‌మా అన్న‌ది తెలియ‌దు కానీ.. విజ‌య్ మాత్రం నెటిజ‌న్ల‌ను ఇట్టే ఆక‌ట్టుకుంటున్నారు.

English Title
vijay devarakonda new look
Related News