వర్మకు అర్జున్‌ రెడ్డి షాక్

Updated By ManamWed, 03/14/2018 - 09:30
Varma, Vijay

Varma, Vijay పెళ్లి చూపులు, అర్జున్‌రెడ్డి సినిమాలతో యంగ్ హీరో విజయ్ దేవరకొండ జాతకం పూర్తిగా మారిపోయింది. దీంతో అతడితో సినిమాలు తీసేందుకు టాలీవుడ్‌ దర్శకులతో పాటు కోలీవుడ్ దర్శకులు సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఓ తమిళ్ సినిమాను కూడా ప్రారంభించాడు విజయ్. 

ఇదంతా పక్కనపెడితే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఈ యంగ్ హీరో నో చెప్పడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఓ సినిమాను చేద్దామని ఇటీవల వర్మ, విజయ్‌ను సంప్రదించగా చేయలేని చెప్పేశాడట. ప్రస్తుతం తన చేతి నిండా సినిమాలు ఉన్నాయని.. అందుకే చేయలేనని చెప్పేశాడట. దీంతో వర్మ మరో హీరోను వెతుకున్నే పడ్డట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నాగార్జున హీరోగా వర్మ తెరకెక్కించిన ఆఫీసర్ ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

English Title
Vijay Devarakonda shocks to Ram Gopal VarmaRelated News