మాల్యాకు బ్రిటన్‌ కోర్టులో ఊరట.. కానీ

Updated By ManamSat, 06/16/2018 - 08:48
Mallya

mallya  లండన్: బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి లండన్‌లో తలదాచుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు బ్రిటన్ కోర్టులో కాస్త ఊరట లభించింది. అతనికి సంబంధించిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బకాయిలను రాబట్టేందుకు బ్రిటన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన 13 బ్యాంకుల కన్సార్టియంకు ఊరట లభించింది. అయితే న్యాయపోరాటం కోసం భారత బ్యాంకులకు అవుతున్న ఖర్చును(రూ.1.80కోట్లు) మాత్రం తప్పకుండా మాల్యా చెల్లించాల్సిందేనని ఆదేశించారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ఆండ్రూ హెన్షా.. మాల్యా ఆస్తులను స్తంభింపజేసేందుకు నిరాకరించారు. కాగా మాల్యాను భారత్‌కు పంపాల్సిందిగా కోరుతూ భారత్ వేసిన పిటిషన్‌పై వచ్చే నెల వెస్ట్ మినిస్టర్ కోర్టులో తుది వాదనలు జరగనున్నాయి.

English Title
Vijay Mallya Asked To Pay 200,000 Pounds To Indian Banks By UK Court




Related News