విజయ్ మాల్యాకు స్వల్ప ఊరట..

Updated By ManamMon, 09/03/2018 - 21:19
Vijay Mallya, 3 Weeks To Reply, Probe Agency Application

Vijay Mallya, 3 Weeks To Reply, Probe Agency Applicationముంబై: బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాకు కోర్టులో స్వల్ప ఊరట లభించింది. సోమవారం ముంబై ప్రత్యేక కోర్టు సోమవారం మాల్యా కేసును విచారించింది. మాల్యాను ‘పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు’గా గుర్తించాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ పిటిషన్‌పై సమాధానం ఇస్తూ మాల్యాకు కోర్టు మూడు వారాల గడువు ఇచ్చింది. సెప్టెంబర్‌ 24లోపు మాల్యా వివరణ ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

English Title
Vijay Mallya Gets 3 Weeks To Reply To Probe Agency Application
Related News