కింగ్‌ఫిషర్ క్లైములు చెల్లించాల్సిందే

Updated By ManamMon, 02/12/2018 - 22:08
Vijay Mallya

విజయ్ మాల్యాకు ప్రతికూలంగా లండన్‌లో వెలువడిన మరో తీర్పు
Vijay Mallyaలండన్/సింగపూర్:
ప్రస్తుతం మూతపడిన స్థితిలో ఉన్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి ఆ సంస్థ అధినేత విజయ్ మాల్యా మరో న్యాయ పోరాటంలోను ఓటమిని చవి చూశారు. సింగపూర్‌కు చెందిన బి.ఓ.సి ఏవియేుషన్‌కు సుమారు 9 కోట్ల అవెురికన్ డాలర్లను క్లైములుగా చెల్లించవలసి ఉంటుందని బ్రిటన్ హైకోర్టు ఆదేశించింది. ఇది 2014లో విమానాలను లీజుకు ఇవ్వడానికి సంబంధించి  కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌తో ముడిపడిన కేసు. మద్యం వ్యాపారి 62 ఏళ్ళ విజయ్ మాల్య ఇప్పటికే అనేక కోర్టు కేసులతో సతమతమవుతున్నారు. భారతీయ బ్యాంకులకు ఆయన రూ. 9,000 కోట్ల మేరకు రుణ బకాయిలను ఎగవేసిన ఆరోపణను ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి తదుపరి విచారణకు ఆయనను అప్పగించాలని బ్రిటన్‌ను భారతదేశం కోరుతోంది. విమానాల లీజు కేసు మార్చి 16న లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టుకు తిరిగి వచ్చింది. ‘‘క్లైమ్‌ను విజయువంతంగా సమర్థించుకునే నిజమైన అవకాశం ప్రతివాదులకు లేదు’’ అని లండన్‌లో బిజినెస్ అండ్ ప్రాపర్టీ కోర్ట్స్ ఆఫ్ ద హైకోర్ట్‌కు చెందిన జస్టిస్ పికెన్ ఫిబ్రవరి 5న ఇచ్చిన తీర్పులో పేర్కొన్నారు. సింగపూర్‌లోని బి.ఓ.సి ఏవియేుషన్, బి.ఓ.సి ఏవియేుషన్ (ఐర్లాండ్) లిమిటెడ్ వేసిన దావాలో గింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్, యునైటెడ్ బ్రూవరీస్ (హోల్డింగ్స్) లిమిటెడ్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ‘‘తీర్పు మాకు సంతోషాన్ని ఇచ్చింది. ఈ దశలో ఇంతకుమించి వ్యాఖ్యానించదలచుకోలేదు’’ అని సింగపూర్‌లోని బి.ఓ.సి ఏవియేుషన్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. ఈ లీగల్ క్లైమ్ విమానాలను లీజుకిచ్చే కంపెనీ బి.ఓ.సి ఏవియేుషన్‌కు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కి మధ్య నాలుగు విమానాల లీజు అగ్రిమెంటుకు సంబంధించినది. మూడు విమానాల అప్పగింత పూర్తయింది. లీజు ఒప్పందం కింద చెల్లించవలసి ఉన్న మొత్తాలను తొక్కిపెట్టినందుకుగాను నాల్గవ విమానాన్ని అప్పగించలేదని చెబుతున్నారు. ఇటువంటి వ్యవహారాలలో అయితే సాధారణంగా సెక్యూరిటీ డిపాజిట్ సమస్య పరిష్కారానికి సహాయపడుతుంది. కానీ, ఈ కేసులో అది కూడా తగినంత లేదని, ‘‘ఒప్పందం ప్రకారం’’ కింగ్‌ఫిషర్ చెల్లించవలసి ఉన్న మొత్తానికి సరిపోయేంతగా అది లేదని బి.ఓ.సి ఏవియేుషన్ పేర్కొంది. దాని పర్యవసానంగానే అది లండన్ హైకోర్టును ఆశ్రయించింది. బి.ఓ.సికి చెల్లించవలసి ఉన్న బకాయిని వడ్డీతో సహా, కోర్టు ఖర్చులను కలిపి చెల్లించాలని జస్టిస్ పికెన్ తీర్పునిచ్చారు. అవన్నీ కలసి దాదాపు 9 కోట్ల అవెురికన్ డాలర్ల మేరకు ఉండవచ్చని భావిస్తున్నారు. ‘‘ఈ కేసులో రెండవ ప్రతివాది (యునైటెడ్ బ్రూవరీస్) మొదటి ప్రతివాది (కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్)తో కలసి సంయుక్తంగాను, విడి గాను కక్షిదారు (బి.ఓ.సి ఏవియేుషన్)కు బకాయి మొత్తంలో సగం చెల్లించడంలో బాధ్యత వహించవలసిందే’’ అని కోర్టు ఆదేశించింది. ఈ అంశంపై కింగ్‌ఫిషర్ ఇంకా స్పందించలేదు. 

అప్పగింత కేసు
మాల్యాను అప్పగించాలని ఇండియా పెట్టిన కేసులో తుది వాద ప్రతివాదనలలో ఒకటి మార్చి 16న సాగవలసి ఉంది. దానిపై ఛీఫ్ మేజిస్ట్రేట్ ఎమా అర్బత్‌నాట్ వచ్చే మే నెలలో తీర్పు వెలువరించవచ్చని భావిస్తున్నారు. మాల్యా అప్పగింత కేసులో కడపటి వాదనలు జనవరిలో సాగాయి. మాల్యా 6,50,000 పౌండ్ల బెయిల్ బాండ్ గడువును వచ్చే ఏప్రిల్ 2 వరకు పొడిగించారు. స్కాట్లండ్ యార్డ్ జారీ చేసిన వారంట్‌తో మాల్యాను గత ఏడాది ఏప్రిల్‌లో అరెస్టు చేశారు. అప్పగింత కేసుపై విచారణ గత ఏడాది డిసెంబరు 4న మొదైలెంది. అప్పటి నుంచి ఆయన దాని వాద ప్రతివాదనలకు హాజరవుతూ వస్తున్నారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ భారదేశంలో బ్యాంకులకు దాదాపు రూ. 9,000 కోట్ల మేరకు రుణం ఎగవేసిందని అంచనా. ఆయునను భారతదేశానికి బలవంతంగా తిప్పి పంపవచ్చా అనే అంశంపై వాదనలు సాగుతున్నాయి. తాము సవుర్పించిన ఆధారాలు ఆ వ్యాపారవేత్తకు ‘‘నిజాయతీ లేదు’’ అని ధ్రువీకరిస్తున్నాయని, ఆయన అక్రమ ప్రాతినిధ్యాల ద్వారా రుణాలు పొందారని, వాటిని తిరిగి చెల్లించే ఉద్దేశం ఆయునకు లేదని అప్పగింత కేసులో భారత ప్రభుత్వం తరఫున వాదిస్తున్న క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ పేర్కొంది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తీసుకున్న అప్పును చెల్లించలేకపోవడం వ్యాపార వైఫల్య ఫలితవేునని మాల్యా తరఫున వాదిస్తున్న న్యాయువాదుల బృందం చెబుతోంది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ విస్తృత కోణం నుంచి దాన్ని చూడాలని, దాని యజమానికి ‘‘మోసపూరిత’’ ఉద్దేశాలు లేవని అది అంటోంది. ప్రపంచ వ్యాప్తంగా మాల్యాకున్న 1.5 బిలియన్ డాలర్ల ఆస్తులను స్తంభింపజేసిన ఉత్తర్వుపై మరో కేసు కూడా నడుస్తోంది. 13 భారతీయ బ్యాంకులు సమర్పించిన డాక్యుమెంట్లపై రెండు రోజుల వాదనలు వచ్చే ఏప్రిల్ 11న ప్రారంభం కానున్నాయి. 
 

English Title
Vijay Mallya loses battle against Singapore’s BOC Aviation, told to pay $90 million in claims
Related News