భారత్‌ రావాలనుకుంటున్న మాల్యా..?

Updated By ManamWed, 07/25/2018 - 12:21
mallya

mallya లండన్: బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకున్న లిక్కర్ కింగ్ విజయ్‌ మాల్యా భారత్‌కు తిరిగి రావాలనుకుంటున్నారట. అంతేకాదు స్వదేశానికి తిరిగి వచ్చి న్యాయ విచారణ ఎదుర్కోవడానికి మాల్యా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మాల్యా తన ప్రతినిధులను దర్యాప్తు సంస్థల వద్దకు పంపి ఈ విషయాన్ని చెప్పినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లోని అధికారులు వెల్లడించినట్లు సమాచారం.

ప్రస్తుతం మాల్యాపై లండన్‌లోని కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ ఆర్డినెన్స్‌ ద్వారా ప్రభుత్వం మాల్యా ఆస్తులను వెంటనే జప్తు చేసే అవకాశం ఉంది. మరోవైపు పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల ఆర్డినెన్స్‌ కింద మాల్యాపై చర్యలు తీసుకోవాలని ఈడీ, ఇటీవల ముంబయిలోని అవినీతి నిరోధక చట్టం(ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరింది. దీంతో కోర్టు ఆగస్టు 27న న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని మాల్యాకు సమన్లు జారీ చేసింది. ఈ సమన్ల ప్రకారం చెప్పిన తేదీకి కోర్టు ఎదుట హాజరుకాకపోతే మాల్యాను పారిపోయిన ఆర్థిక నేరగాడుగా ప్రకటించే అవకాశం ఉంది. దీంతో మాల్యా భారత్‌కు రావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

English Title
Vijay Mallya want to come India
Related News