షార్ట్‌ఫిల్మ్‌లో విజయ్ తనయుడు

Updated By ManamWed, 09/26/2018 - 01:49
sanjay

imageహీరో విజయ్‌కి తమిళ్‌లో ఫాలోయింగ్ ఎక్కువ. విజయ్ కుమారుడు సంజయ్ తెరంగేట్రంపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సంజయ్ ఓ షార్ట్ ఫిల్మ్ ద్వారా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం విదేశాల్లో చదవుకుంటున్న సంజయ్ హాలీడేస్‌కి ఇక్కడికి వచ్చినపుడు ‘జంక్షన్’ అనే షార్ట్ ఫిల్మ్ చేశారు. ఇటీవల ఈ షార్ట్‌ఫిల్మ్‌కి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. గతంలో ‘వేట్టైకారన్’ చిత్రంలో ‘నాన్ అడిచ్చా తాంగమాట్ట..’ పాటలో అతను నటించిన విషయం తెలిసిందే. అయితే నటన కన్నా తనకు దర్శకత్వంపైనే ఎక్కువ ఆసక్తి ఉందని గతంలో సంజయ్ ప్రకటించారు.

English Title
Vijays son in short films
Related News