విలన్‌గా...

Updated By ManamThu, 09/06/2018 - 22:33
mammutti

వైవిధ్యమైన పాత్రల్లో నటించడానికి మలయాళ అగ్ర కథానాయకులైన మోహన్‌లాల్, మమ్ముట్టి ఆసక్తిని కనపరుస్తుంటారు. మమ్ముట్టి విషయానికి వస్తే ఆయన ఇప్పుడు తెలుగులో యాత్ర సినిమాలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈయన తమిళంలో విలన్‌గా నటించబోతున్నారు. జయం రవి, మోహన్ రాజా కాంబినేషన్‌లో వచ్చిన ‘తనీ ఒరువన్’కు సీక్వెల్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి. తనీ ఒరువన్‌లో అరవింద స్వామిని విలన్‌గా చూపించిన దర్శకరుడు మోహన్ రాజా.. సీక్వెల్‌లో మమ్ముట్టిని విలన్‌గా చూపించాలనుకుంటున్నారట. చిత్ర యూనిట్ మమ్ముట్టితో సంప్రదింపులు జరుపుతుంది. 
 

image

 

English Title
as Villain
Related News