విరుష్క‌ జంట.. డ్రీమ్ హౌస్‌ అద్దె నెలకు ఎంతో తెలుసా?

Updated By ManamMon, 03/12/2018 - 21:41
Virat Kohli, Anushka Sharma, new Mumbai flat, Rs 15 Lakh per month

Virat Kohli, Anushka Sharma, new Mumbai flat, Rs 15 Lakh per monthముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సినీ నటి అనుష్క శర్మ దంపతులు తమ పెళ్లి పుస్తకాన్ని సంతోషమనే పేజీలతో నింపుకుంటూ హాయిగా గడిపేస్తున్నారు. కొన్నేళ్లపాటు ప్రేమపక్షుల్లా విహరించిన విరుష్క‌ జంట గతఏడాది ఇటలీలో పెళ్లిచేసుకుని అందరిని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. తమ అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ తమ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. ప్రస్తుతం విరుష్క‌ జంటకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతవరకూ బాగానే ఉంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వీరుష్క జంట తమ వివాహ బంధాన్ని కొనసాగించేందుకు ముంబైలోని వర్లిలో తమ డ్రీమ్ హౌస్‌లో కొత్తకాపురం పెట్టబోతున్నారంట.

ఇంతకీ విరుష్క‌ జంట ఉండబోయే డ్రీమ్ హౌస్‌కు చెల్లించే అద్దె ఎంతో తెలుసా? నెలకు రూ. 15 లక్షలు. అవును మీరు చదివింది కరెక్టే. ఇది తాత్కాలిక నివాసమైనప్పటికీ.. ఇక్కడ వీరిద్దరూ కలిసి ఏడాది పాటు నివాసముంటారట. త్వరలోనే విరుష్క‌ జంట వర్లిలోని ఈ కొత్త నివాసానికి మారబోతున్నారట. ముంబైలోని వర్లిలో రహేజా లెజెండ్స్ అపార్ట్‌మెంట్‌లోని 40వ అంతస్థును కొన్నారట. 2675 చదరపు అడుగులు ఉండే ఈ పాలిటియల్ ఫ్లాట్లో కోహ్లీ, అనుష్క దంపతులు నెలకు రూ. 15లక్షల వరకు అద్దెను చెల్లించనున్నారు. ఈ ఫ్లాట్ కోసం రూ. 1.01 కోట్ల రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్‌ కుదుర్చుకున్న విరాట్.. ఇప్పటికే రూ.1.50 కోట్ల రూపాయలను డిపాజిట్ చేసినట్టు నివేదికలు సూచిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ.. విరాట్, అనుష్క శర్మల పెళ్లి పుస్తకంలోని పేజీలు మరెన్నో సంతోషాలతో నిండిపోవాలని ఆశిద్దాం..

English Title
Virat Kohli and Anushka Sharma's rent for new Mumbai flat is Rs 15 Lakh per month. Yes, read that again
Related News