కోహ్లీ.. మీరాబాయికి ‘ఖేల్‌రత్న’

Updated By ManamThu, 09/20/2018 - 18:54
Virat Kohli, Mirabai Chanu receive, Khel Ratna, September 25
  • విరాట్ సహా మీరాబాయి చానుకు ఖేల్‌రత్న 

  • తెలుగు రాష్ట్రాల టెన్నిస్ కోచ్ శ్రీనివాసరావుకి ద్రోణాచార్య

  • తెలుగు రాష్ట్రాల బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కిరెడ్డికి అర్జున  

  • ఈ నెల 25న అవార్డులను అందుకోనున్న క్రీడాకారులు

Virat Kohli, Mirabai Chanu receive, Khel Ratna, September 25న్యూఢిల్లీ: క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రీడాకారులకు ఇచ్చే దేశ అత్యున్నత పురస్కారం ‘ఖేల్‌రత్న’ పురస్కారాన్ని భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు దక్కించుకున్నాడు. కోహ్లీతో పాటు వెయిట్ లిప్టింగ్ చాంపియన్ మీరాబాయి చానుకు కూడా రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డు దక్కింది. గురువారం క్రీడా మంత్రిత్వ శాఖ స్పోర్ట్స్ అవార్డులను అధికారికంగా ప్రకటించింది. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులకు విరాట్ కోహ్లీతో పాటు మీరాబాయి చానును సిఫార్సు చేయగా ఇద్దరికి ఖేల్‌రత్న దక్కింది.

గత మూడేళ్లుగా అద్భుత ప్రదర్శనతో రాణిస్తూ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ టెస్టు బ్యాట్స్‌మన్‌గా నెంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. కానీ (2016-2017)లో ఖేల్‌రత్న పురస్కారానికి బీసీసీఐ కోహ్లీ పేరును ప్రతిపాదించినప్పటికీ ఏదో ఒక కారణంగా అతడికి పురస్కారం దక్కలేదు. కానీ, ఈసారి అనూహ్యంగా కోహ్లీని ఖేల్‌రత్న అవార్డుకు ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో కోహ్లీ అభిమానుల్లో ఆనందం నెలకొంది. ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైన కోహ్లీతోపాటు మీరాబాయి చానుకు ఈ నెల 25న రాష్ట్రపతి భవన్‌లో రామ్‌నాధ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డులను అందుకోనున్నారు. 
 
తెలుగు రాష్ట్రాలకు ద్రోణాచార్య.. అర్జున
ఇక ద్రోణాచార్య అవార్డులకు అచ్చయ్య కుట్టప్ప (బాక్సింగ్), విజయ్ శర్మ (వెయిట్ లిప్టింగ్) ఎంపిక అయ్యారు. తెలుగు రాష్ట్రానికి చెందిన టేబుల్ టెన్నిస్ కోచ్ ఎ. శ్రీనివాసరావును ద్రోణాచార్య అవార్డుకు ఎంపిక అయ్యారు. అలాగే సుఖ్‌దేవ్ సింగ్ పన్ను (అథ్లెటిక్స్), క్లారెన్స్ లోబో (హాకీ), తారక్ సిన్హా (క్రికెట్) జవాన్ కుమార్, వీఆర్ బీడు (అథ్లెటిక్స్) కూడా ద్రోణాచార్య అవార్డులకు ఎంపికయ్యారు. అర్జున అవార్డు దక్కించుకున్న వారిలో తెలుగు రాష్ట్రానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కిరెడ్డికి అర్జున అవార్డుకు ఎంపిక చేశారు. 

English Title
Virat Kohli, Mirabai Chanu to receive Khel Ratna on September 25
Related News