రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబే ఆటంకం: విష్ణు కుమార్ రాజు

Updated By ManamSat, 04/07/2018 - 12:44
Vishnu Kumar Raju

Vishnu Kumar Raju అమరావతి: స్వలాభం కోసమే చంద్రబాబు అఖిలపక్ష భేటీ నిర్వహిస్తున్నారని, అందుకే ఆ సమావేశానికి వెళ్లడం లేదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఈ మేరకు ఆయన చంద్రబాబుకు లేఖను రాశారు. ఏపీకి కేంద్రం, మోదీ అన్యాయం చేశారనడం రాజకీయమేనని ఆయన అన్నారు. 

చంద్రబాబుకు మోదీ కన్నా సోనియా, రాహుల్ ముద్దుగా కనిపిస్తున్నారని.. అతడి ద్వంద్వ వైఖరిని ఎండగడతామని విష్ణు కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక చంద్రబాబు నాటకం ఆడుతూ అందరినీ విమర్శిస్తున్నారని, రాష్ట్రాభివ‌ద్ధికి చంద్రబాబే ఆటంకం అని విష్ణు కుమార్ రాజు తెలిపారు.

English Title
Vishnu Kumar Raju fire on Chandrababu Naidu 
Related News