క్రెడిట్ కోసమే టీడీపీ డ్రామాలు

Updated By ManamFri, 06/29/2018 - 11:01
vishnu Kumar Raju

vishnu kumar raju అమరావతి: కేంద్రం ఏదైనా ఇవ్వబోతుందని తెలిస్తే దానిమీదే టీడీపీ దీక్షలు చేస్తుందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. క్రెడిట్ కోసమే టీడీపీ డ్రామాలు చేస్తుందని ఆయన ఆరోపించారు. కడప స్టీల్ ప్లాంట్‌పై ఆందోళనలు అనవసరమని, స్టీల్ ప్లాంట్‌ కచ్చితంగా వస్తుందని ఆయన అన్నారు. కడప స్టీల్ ప్లాంట్‌ను గాలి జనార్ధన్‌రెడ్డికి ఇస్తారనేది గాలి వార్త అని ఈ సందర్భంగా విష్ణు కుమార్ రాజు చెప్పారు. అలాగే విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ కూడా వస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఏపీలో జరిగే అవినీతిపై ఉద్యమాలు, దీక్షలు చేయాలి అంటూ ఆయన సూచించారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణపై దాడికి ముఖ్యమంత్రి చంద్రబాబునే జవాబు చెప్పాలని విష్ణు కుమార్ రాజు పేర్కొన్నారు.

English Title
Vishnu Kumar Raju fire on TDP




Related News