చంద్రబాబుది నోరా..? అరిగిపోయిన టేప్ రికార్డరా..?

Updated By ManamSun, 04/15/2018 - 11:36
Vishnu Kumar Raju, Chandrababu

Vishnu Kumar Raju, Chandrababu Naidu అమరావతి: ‘‘చంద్రబాబుది నోరా.. అరిగిపోయిన టేప్ రికార్డరా’’ అంటూ ఏపీ సీఎంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఘాటు విమర్శలు చేశారు. కేంద్రం చేసిన సాయంపై చంద్రబాబు అసెంబ్లీలో అన్ని అబద్దాలే చెప్పారని ఆయన విమర్శించారు. ఏరు దాటాక.. తెప్ప తగలేసే రకం టీడీపీదని పేర్కొన్నారు. 2019లో చక్రం తిప్పేది తామేనంటూ చంద్రబాబు అంటున్నారని.. అయితే ఆ చక్రం తిప్పడానికి టీడీపీకి వేలు ఉండాలి కదా అంటూ కామెంట్ చేశారు.

కేవలం ఓట్లు, రాజకీయం కోసమే చంద్రబాబు దీక్ష చేస్తున్నారని.. మోదీ దీక్ష చేశారనే బాబు దీక్ష చేస్తున్నారని విమర్శించారు. అందరినీ ఫాలో అవ్వడం, కాపీ కొట్టడమే చంద్రబాబు పని అని.. హోదా విషయంలో జగన్‌ను, దీక్ష విషయంలో మోదీని కాపీ కొట్టారని ఎద్దేవా చేశారు. ఇక ఫొటో షూట్ కోసమే బాబు పార్లమెంట్ మెట్లకు మొక్కారని పేర్కొన్నారు.

English Title
Vishnu Kumar Raju fires on Chandrababu Naidu 




Related News