రేపు ఏ పార్టీలో ఉంటానో తెలీదు: విష్ణు కుమార్ రాజు

Updated By ManamWed, 09/12/2018 - 09:58
Vishnu Kumar Raju

Vishnu Kumar Rajuఅమరావతి: రేపు ఏ పార్టీలో ఉంటానో తెలీదంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో ఉన్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానని తేల్చి చెప్పారు. ఏపీకి బీజేపీ ఇచ్చిన నిధుల విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తుండగా, టీడీపీ నేతలు కల్పించుకుని వాస్తవాలు మాట్లాడాలని సూచించారు. దీంతో స్పందించిన విష్ణుకుమార్ రాజు తాను ఏ పార్టీలో ఉన్నా వాస్తవాలే మాట్లాడతానని, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం తన నైజమని అన్నారు.

గుజరాత్‌లో పటేల్ విగ్రహానికి కేంద్రం రూ.2,500 కోట్లు ఇచ్చిందని ఆరోపిస్తున్నారని, నిజానికి ఆ విగ్రహం కోసం ఇచ్చింది రూ.300 కోట్లేనని విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉందన్న ఆయన, అందుకోసం తాను కూడా పోరాడతానని పేర్కొన్నారు.

English Title
Vishnu Kumar Raju sensational comments




Related News