'దీక్షల పేరుతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు'

Updated By ManamSun, 05/20/2018 - 15:23
AP CM chandrababu naidu, Vishnu kumar raju, Dharma porata deeksha, BJP leader

AP CM chandrababu naidu, Vishnu kumar raju, Dharma porata deeksha, BJP leaderవిజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై బీజేపీ శాసనసభపక్ష నేత విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. చంద్రబాబు చేపట్టే ధర్మపోరాట దీక్ష పూర్తిగా అధర్మమైనదని ఆయన విమర్శించారు. ఆదివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి కేంద్రం ఏమి అన్యాయం చేసిందని దీక్షల పేరుతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ చంద్రబాబును ఆయన సూటిగా ప్రశ్నించారు. విశాఖలో చంద్రబాబు చేపట్టనున్న ‘ధర్మపోరాట దీక్ష’ ఈనెల 22న జరగనున్న జరుగనున్న సంగతి తెలిసిందే.

ఈ దీక్షల కోసం ప్రభుత్వ పథకాల లబ్దిదారుల్ని బలవంతంగా చంద్రబాబు తరలిస్తున్నారని విష్ణుకుమార్ ఆరోపించారు. దీక్ష సభల్లో అక్కడ సీఎం చంద్రబాబు కొత్త విషయాలేమీ చెప్పడం లేదని, పాడిన పాత పాటే మళ్లీ పాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. విశాఖ భూకుంభకోణంపై సిట్ సమర్పించిన విచారణ నివేదికను దీక్షా వేదికపై వెల్లడించే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు.

English Title
Vishnu kumar raju slams AP CM chandrababu naidu
Related News